Switch to English

బర్త్ డే స్పెషల్: సచిన్‌ – టన్నుల్లో పరుగులు., కోట్లలో అభిమానులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

సచిన్‌ టెండూల్కర్‌.. పరిచయం అక్కర్లేని పేరిది.! కొత్తగా ఏం చెబుతాం ఈ క్రికెట్‌ దేవుడి గురించి. ప్రత్యర్థుల్ని సైతం తన అభిమానులుగా మార్చేసుకోగల సత్తా క్రికెట్‌ ప్రపంచంలో ఇంకెవరికైనా వుందంటే అది ఒక్క సచిన్‌ టెండూల్కర్‌కి మాత్రమే. సచిన్‌ గట్టిగా బాదితే పరుగులొస్తాయి.. సచిన్‌ సొగసుగా కొడితే పరుగులొస్తాయి.. సచిన్‌ ఫోకస్‌ పెడితే, ప్రత్యర్థుల నోళ్ళు మూతలుపడ్తాయ్‌.. క్రికెట్‌ విశ్లేషకులకీ మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుంది.

అవును, సచిన్‌ టెండూల్కర్‌ అందరికీ సాఫ్ట్‌ టార్గెట్‌. ఎందుకంటే, ఎవరెంతలా తనను విమర్శించినా ఆయన స్పందించడు. ఆయన బ్యాట్‌ నుంచి జాలువారే పరుగులు మాత్రం స్పందిస్తుంటాయి. క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ లాంటి క్రికెటర్‌ని మనం చూడలేం.. ఇది మాత్రం ముమ్మాటికీ నిస్సందేహం. ఏమో, పరుగుల పరంగా సచిన్‌ రికార్డుని ఎవరైనా ముందు ముందు దాటేయగలరేమో. కానీ, వ్యక్తిత్వంలో సచిన్‌ టెండూల్కర్‌ని దాటెయ్యడం ఏ క్రికెటర్‌కీ సాధ్యం కాని పని. అయినా, ప్రత్యర్థులు, క్రికెట్‌ విశ్లేషకులూ.. ఆఖరికి సొంత దేశానికి చెందిన విశ్లేషకులూ అవాకులు చెవాకులూ పేలుతున్నా, మైదానంలో చాలా కూల్‌గా కన్పించడం సచిన్‌ టెండూల్కర్‌కి మాత్రమే చెల్లుతుంది.

నెర్వస్‌ నైన్‌టీస్‌.. అంటూ సచిన్‌ని చాలామంది అప్పట్లో ఎగతాళి చేసేవారు. 90 నుంచి 100 పరుగుల మధ్య తీవ్ర ఒత్తిడికి గురవుతాడట సచిన్‌. ఈ క్రమంలో చాలాసార్లు ఈ పరుగుల మధ్యనే ఔటయి, సెంచరీల్ని చేజార్చుకున్నాడన్నది కొందరు విశ్లేషకుల వాదన. కానీ, ప్రతి పరుగూ సచిన్‌కి ముఖ్యమే. అది ఒకటో పరుగు అయినా, 99వ పరుగు అయినా సచిన్‌ ఆట తీరులో మార్పు వుండదు. సచిన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ సెంచరీ చేయకూడదని ప్రత్యర్థి బౌలర్‌ చిత్ర విచిత్రమైన వ్యూహాలు పన్నడం చాలాసార్లు చూశాం. కొన్నిసార్లు ఈ వ్యూహాలు ఫలించాయి కూడా. అయినాగానీ, సచిన్‌.. ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. ఎప్పుడూ రికార్డుల గురించి ఆలోచించలేదు.

ఎందుకంటే, సచిన్‌ చేసే ప్రతి పరుగూ టీమిండియా గెలుపు కోసం. ఆ గెలుపు ముందు తన వ్యక్తిగత రికార్డులు జస్ట్‌ నథింగ్ అంటాడు సచిన్‌ టెండూల్కర్‌. సచిన్‌ అంటే భారతరత్నం.. అవును, ఆయన క్రికెట్‌ రత్నం. పరుగుల వరదకి కేరాఫ్‌ అడ్రస్‌ ఆయన. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. సచిన్‌ ఎప్పుడో క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పేశాడు. కానీ, ఇప్పటికీ టీమిండియా ఎక్కడ క్రికెట్‌ ఆడినా, అక్కడ సచిన్‌ అభిమానులుంటారు.. ఇంట్లో కూర్చుని మ్యాచ్‌ చూస్తున్న సచిన్‌ని, గ్రౌండ్‌లో మ్యాచ్‌ని తిలకిస్తున్న సచిన్‌ అభిమానులు ఉత్సాహపరుస్తుంటారు.

ఇలాంటి అభిమానం సచిన్‌కి తప్ప ఇంకెవరికి వుంది.? ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మాస్టర్‌ బ్లాస్టర్‌కి తెలుగుబుల్లెటిన్.కామ్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...