టాలీవుడ్ ప్రేక్షకులు మల్టీస్టారర్ చిత్రాల కోసం మొహం వాచి ఉన్నారు. స్టార్ హీరోల మల్టీస్టారర్ వచ్చి ఎన్ని దశాబ్దాలు అయ్యిందో, మళ్లీ ఇన్నాళ్లకు జక్కన్న భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని స్టార్స్ తో చేస్తున్నాడు. ఈ సమయంలోనే మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలు ఆన్ది వే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాని ఏ సినిమా కూడా పట్టాలెక్కుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల మల్టీ స్టారర్ చిత్రం గురించి సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది.
వీరిద్దరి కాంబో మల్టీస్టారర్ ఏమో కాని త్వరలో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌ల మల్టీస్టారర్ మూవీ కన్ఫర్మ్గా వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. తాజాగా ఒక నెటిజన్ వరుణ్ తేజ్‌ను మీ ఇద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ ఎప్పుడు చూస్తామో అంటూ ప్రశ్నించాడు. అందుకు వరుణ్ చాలా పాజిటివ్‌గా స్పందించాడు. తప్పకుండా మేమిద్దరం కలిసి నటిస్తాం. మేము నటించేందుకు స్క్రిప్ట్ కోసం చూస్తున్నాం అన్నట్లుగా వరుణ్ తేజ్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమాను కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ విషయానికి వస్తే ఈయన నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా దేవ కట్టా దర్శకత్వంలో ఒక సినిమా మొదలయ్యింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వీరిద్దరి కోసం ప్రముఖ రచయిత స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. 2022 వరకు వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలున్నాయని మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది.
170242 661429Do you wear boxers or biefs? I wana bui em. 207553
522939 508236Hi! I discovered your website accidentally today, but am actually pleased that we did! Its not only entertaining, but in addition straightforward to make use of in contrast to lots that Ive viewed! 925137
966494 661642I always visit your weblog and retrieve everything you post here but I never commented but today when I saw this post, I couldnt stop myself from commenting here. Amazing write-up mate! 246631