Switch to English

పబ్లిసిటీ పైత్యం: ముఖ్యమంత్రికి అండగా వుండడమేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

పార్టీ అధినేత మీద మమకారమెక్కువైపోతే.. ఆ దిశగా ప్రతి రోజూ ప్రకటనలు ఇచ్చుకోవచ్చుగాక.! అది ఆయా వ్యక్తుల ఇష్టాన్ని బట్టి వుంటుంది. కానీ, రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రికి అండగా వుండాలని మంత్రులు ప్రకటనలు గుప్పించడమేంటి.? ఇది కూడా ప్రకృతి వైపరీత్యం లాంటిదేమోనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ప్రపంచ రాజకీయాల్లోనే ఎప్పుడూ ఎక్కడా కనీ వినీ ఎరుగని వింత పైత్యం ఇది. యావత్‌ ప్రపంచం కరోనా వైరస్‌ దెబ్బకి విలవిల్లాడుతోంది. ఈ సమయంలో ప్రజలకు అండగా వుండాల్సింది ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలు ప్రజలకు భరోసా ఇచ్చేలా వుండాలి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రజలంతా ముఖ్యమంత్రిగారికి అండగా వుండాలట.

గతంలో టీడీపీ అధినేత, అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ‘నాకు మీరంతా అండగా వుండాలి..’ అని పిలుపునిచ్చి, ప్రజల్లో పలచనైపోయారు. నిత్యం చంద్రబాబు విధానాలపై విరుచుకుపడే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, చిత్రంగా అదే చంద్రబాబు బాటలో పయనిస్తుండడం గమనార్హం.

‘స్వామిభక్తి’ వుండొచ్చుగానీ.. మరీ ఇంతలానా.? అంటూ మంత్రుల ప్రకటనలపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 300కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి..వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు కూడా. ‘కరోనా వైరస్‌ మరీ అంత సీరియస్‌ ఏమీ కాదు.. చిన్నపాటి జ్వరం లాంటిదే.. పారాసిటమాల్‌ వేసుకుంటే తగ్గిపోతుంది.. బ్లీచింగ్‌ పౌడర్‌ వేస్తే వైరస్‌ చచ్చిపోతుంది..’ అంటూ లైట్‌ తీసుకున్న ముఖ్యమంత్రికి ప్రజలు అండగా వుండాలనడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

మంత్రులు, ముఖ్యమంత్రి మెప్పు కోసం పోటీ పడుతున్నారా.? ముఖ్యమంత్రే, మంత్రుల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారా.? కరోనా దెబ్బకి తమ భవిష్యత్తు ఏమవుతుందో తెలియక విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలు, అధికార పార్టీ నేతల కామెడీ చూసి ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. తమ దుస్థితి పట్ల ఆందోళన చెందాలో, ప్రభుత్వంలో వున్నవారి వెకిలితనం చూసి విస్తుపోవాలో అర్థం కాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...