బన్నీ, సుకుమార్ ది ఒక క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఆర్య’ సినిమా ఎలాంటి సెన్సేషన్ అనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త నిరాశపరిచిన ఎంతో మందికి ఫెవరైట్ ఫిల్మ్. ‘అల వైకుంఠపురములో’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ తో ముచ్చటగా మూడోసారి అల్లు అర్జున్ తన 20వ సినిమా చేస్తున్నాడు.
షూటింగ్ మొదలు కావాల్సిన టైంలో కరోనా ఎఫెక్ట్ వలన షూటింగ్ హోల్డ్ లో పడింది. ఈ క్వారైంటైన్ టైంలో తన పుట్టిన రోజున అల్లు అర్జున్ తన ఫాన్స్ కి ఫీస్ట్ ఇవ్వడం కోసం సుకుమార్ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ అనౌన్స్ చేశారు. అన్నట్లుగా 9 గంటలకి అల్లు అర్జున్ – సుకుమార్ మూవీ అప్డేట్ రిలీజ్ చేశారు.
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రానున్న 3వ సినిమాకి ‘పుష్ప’ అనే టైటిల్ ని పెట్టారు. అలాగే ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ మాస్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఫుల్ గడ్డంతో మాస్ లుక్ లో అదిరిపోయాడు. కంప్లీట్ అడవి నేపథ్యంలో సాగే ఈ కథలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ గా ఈ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.
ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
279761 416876Hiya. Very cool site!! Man .. Beautiful .. Great .. I will bookmark your web website and take the feeds additionallyI am happy to uncover numerous helpful information here within the post. Thank you for sharing 983460
379092 451998Hello there! Good post! Please inform us when all could see a follow up! 257887