కరోనా మహమ్మారి ఉధృతమవుతున్న వేళ తెలుగు రాష్ట్రాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టాయి. తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. మరుసటి రోజే ఏపీ సీఎం జగన్ ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారు. జీతాల్లో కోత అనగానే తెలంగాణలో ఉద్యోగ సంఘాలు కలవరపడ్డాయి. అయితే, అది కోత కాదని.. పరిస్థితి సద్దుమణిగాక తిరిగి చెల్లిస్తామని సీఎస్ సోమేశ్ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు కాస్త కుదుటపడ్డారు.
ఇక ఏపీలో కోత అని కాకుండా వాయిదా అని ముందుగానే స్పష్టంచేశారు. నిజానికి ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలనే నిర్ణయం రెండు రాష్ట్రాలు కూడా చివరి క్షణంలోనే తీసుకున్నాయని తెలుస్తోంది. గతనెల 22న జనతా కర్ఫ్యూ ముగిసిన తర్వాత మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్టు తెలంగాణ సర్కారు ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ లాక్ డౌన్ కాలానికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ తమ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని.. ఎట్టి పరిస్థితుల్లనూ వారి జీతాల్లో కోత విధించడానికి వీల్లేదని అందులో స్పష్టంచేసింది.
అయితే, వారం తిరిగే సరికి సీఎం కేసీఆర్ మనసు మారింది. ఉద్యోగులకు జీతాలు బంద్ పెట్టాల్సి వస్తుందేమో అని సూచనప్రాయంగా ప్రకటించిన మరుసటిరోజే వారి జీతాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివిధ కేటగిరీలను బట్టి 10 నుంచి 75 శాతం మేర వేతనాలను తగ్గించారు. ఆ మేరకు వారి వేతనాలను ఈనెల 3న ఇవ్వనున్నారు. ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన మొత్తాన్ని రిజర్వు ఫండ్ గా పెడతామని, పరిస్థితి సద్దుమణిగిన తర్వాత చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
ఇక ఏపీలో జీతాల కోతకు సంబంధించి ఎలాంటి ఆలోచనలు లేకపోయినా.. తమతో పోలిస్తే ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనే ఆ మేరకు నిర్ణయం తీసుకున్నందున, తాము కూడా అదే అనుసరించాలని జగన్ భావించినట్టు సమాచారం. అసలే లోటు బడ్జెట్.. దానికి తోడు ఆదాయం పూర్తిగా పడిపోవడం.. కరోనా నేపథ్యంలో ఖర్చు పెరగడం.. ఇక పెదలకు కరోనా సాయంగా రూ.వెయ్యి చెల్లించాలని నిర్ణయించడం వంటి అంశాలు ఖజానాపై ఒత్తిడి పెంచాయి. దీంతో ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఈనెల ఉద్యోగుల జీతాలను కొంత మొత్తం వాయిదా వేయాలని జగన్ నిర్ణయించినట్టు చెబుతున్నారు.
ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోకుంటే జగన్ కూడా జీతాలను వాయిదా వేసి ఉండేవారు కాదు. పలు అంశాల్లో కేసీఆర్ నే ఫాలో అయ్యే జగన్.. తాజాగా ఉద్యోగుల వేతనాల విషయంలోనూ గులాబీ బాస్ బాటలోనే వెళుతున్నారు.
812472 234512Id forever want to be update on new posts on this website , bookmarked ! . 658151
271313 614251i adore action movies and my idol is none other than Gerard Butler. this guy genuinely rocks 335074