Switch to English

టిక్ టాక్ ను నిషేధించండి: మద్రాస్ హైకోర్టు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ప్రముఖ సోషల్ మీడియా వీడియో యాప్ టిక్ టాక్ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. చైనాకు చెందిన ఈ వీడియో యాప్ వల్ల అశ్లీల, అసభ్య కంటెంట్ ఎక్కువగా వ్యాప్తి అవుతోందని ఆందోళన వ్యక్తంచేసిన న్యాయస్థానం.. వెంటనే ఈ యాప్ నిషేధానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఈ మేరకు జస్టిస్ ఎన్.కురుబకరన్, జస్టిస్ ఎస్ఎస్ సుందర్ లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ఈ యాప్ ఉపయోగించి రూపొందించిన వీడియోలను ప్రసారం చేయొద్దని మీడియాకు స్పష్టంచేసింది. టిక్ టాక్ అనే సోషల్ మీడియా యాప్ ఇటీవల కాలంలో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. చైనాకు చెందిన ఈ యాప్ ఉపయోగించి స్పెషల్ ఎఫెక్ట్స్ తో చిన్న చిన్న వీడియోలు చేసే అవకాశం ఉంది. దీంతో యువత దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. తమ అభిప్రాయాలు, జోకులు, ఇతర కంటెంట్ ను దీని ఆ యాప్ సాయంతో రూపొందించి పోస్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం భారత్ లో నెలకు దాదాపు 5.4 కోట్ల మంది వినియోగదారులు దీనిని ఉపయోగిస్తున్నట్టు అంచనా. అయితే, వినోదం కోసం ప్రారంభించిన ఈ యాప్ వల్ల పలు నష్టాలు కూడా కలుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అశ్లీల కంటెంట్ బాగా వ్యాప్తి చెందుతోంది. దీంతో పిల్లలు కూడా వాటికి ప్రభావితం అవుతుండటంతో మధురైకి చెందిన ముత్తుకుమార్ అనే న్యాయవాది ఈ యాప్ ను నిషేధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

ఆయా వీడియోల్లోని అశ్లీల కంటెంట్ కారణంగా పిల్లలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నారని, ఫలితంగా మన సంస్కృతికి కూడా విఘాతం కలుగుతోందని, అంతేకాకుండా పిల్లల్లో హింసా ప్రవృత్తి పెరగడంతోపాటు ఆత్మహత్యలు కూడా చోటుచేసుకుంటున్నాయని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. వెంటనే ఈ యాప్ ను నిషేధించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషనర్ ప్రస్తావించిన అంశాలతో ఏకీభవించింది.

ఈ యాప్ వల్ల అశ్లీల కంటెంట్ వ్యాప్తిచెందడంపై ఆందోళన వ్యక్తంచేసింది. ఈ యాప్ వల్ల కలిగే నష్టాలను పరిగణనలోకి తీసుకుండా దీనిని పిల్లలపై పరీక్షించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఈ కారణంతోనే ఈ యాప్ ను ఇండోనేషియా, బంగ్లాదేశ్ లలో నిషేధించిన విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. మనదేశంలో కూడా ఈ యాప్ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

అలాగే అమెరికాలో వున్నట్టుగా బాలల ఆన్ లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందా లేదా ఈనెల 16లోగా తెలియజేయాలని సూచించింది. కాగా, మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై టిక్ టాక్ ప్రతినిధి స్పందించారు. తమ కంపెనీ స్థానిక చట్టాలకు కట్టుబడి ఉంటుందని ప్రకటించారు.

కోర్టు ఉత్తర్వులు ఇంకా అందలేదని, వాటిని పరిశీలించిన తర్వాత చట్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. యాప్ ద్వారా సురక్షిత, సానుకూల వాతావరణం కొనసాగించడమే తమ ప్రధమ ప్రాధాన్యమని తెలిపారు. బీజింగ్ కేంద్రంగా పనిచేసే బైటేడాన్స్ టెక్నాలజీ కంపెనీ ఈ టిక్ టాక్ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ను నిషేధించాలంటూ ఇటీవల తమిళనాడులోని అన్నాడీఎంకేకు చెందిన నేత తమిమన్ అన్సారీ డిమాండ్ చేశారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన ఇదే

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రముఖ...