Switch to English

మురళీ మోహన్ అడ్డంగా బుక్కయ్యారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత సన్నిహితుడు మురళీమోహన్ అడ్డంగా బుక్కయిపోయారు. రాజమండ్రి ఎంపీగా టీడీపీ తరఫున పోటీచేస్తున్న తన కోడలు మాగంటి రూప ఎన్నికల ఖర్చుల నిమిత్తం పంపిస్తున్న సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాగుల నిండా నోట్ల కట్టలతో వెళుతున్న ఆయన సంస్థలోని ఇద్దరు ఉద్యోగులను హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం రూ.2 కోట్లను వారిద్దరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు.

రూ.కోటి విలువైన ఐదు వందల నోట్లు, మరో కోటి రూపాయల విలువైన రెండు వేల నోట్లు ఉన్నట్టు గుర్తించి, ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు అసలు విషయం ఈజీగానే చెప్పేశారు. తాము జయభేరి ప్రాపర్టీస్ సంస్థ ఉద్యోగులమని, ఈ సొమ్మును హైదరాబాద్ నుంచి రాజమండ్రి తరలిస్తున్నట్టు వెల్లడించారు.

మురళీమోహన్ కోడలు మాగంటి రూప కు అందజేయడం కోసమే ఈ మొత్తాన్ని తాము ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నామంటూ అసలు విషయం పూస గుచ్చినట్టు చెప్పేశారు. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మురళీమోహన్ జయభేరి సంస్థ అధిపతి అన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా. అయితే, ఈసారి తాను ఎంపీగా పోటీ చేయనంటూ ముందుగానే ఆయన తప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన కోడలు మాగంటి రూపకు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. తన మామగారు రాజమండ్రిలో లేని సమయాల్లో పార్టీ కేడర్ కు అండగా ఉండటం.. వారి బాగోగులు చూసుకోవడం వంటి కారణాలతో ఆమె గెలుపు ఖాయమనే భావనతో బాబు ఆమెకే టికెట్ ఇచ్చారు. ఇక ఎన్నికలకు సమయం ఎంతో లేకపోవడంతో ప్రస్తుతం రూప తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు.

అయితే, ఎన్నికల్లో పంపిణీకి అవసరమైన సొమ్మును మురళీమోహన్ హైదరాబాద్ నుంచి పంపించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నారు. కారులో తరలిస్తే తనిఖీల్లో దొరికిపోయే అవకాశం ఉందని భావించి తన సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులను ఇందుకు ఎంపిక చేశారు. వారిని రైలులో రాజమండ్రికి పంపే ఏర్పాట్లు చేశారు.

ఇందుకు అనుగుణంగానే వారిద్దరూ బుధవారం సాయంత్రం మాదాపూర్ లోని తమ సంస్థ కార్యాలయం నుంచి రూ.2 కోట్ల మొత్తాన్ని రెండు బ్యాగుల్లో సర్దుకుని హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ కు ఆటోలో వెళ్లారు. అక్కడి నుంచి ఎంఎంటీఎస్ లో సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి వెళ్లాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. అలా అయితే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ లో లగేజీ చెకింగ్ చేయించుకునే అవకాశం కూడా ఉండదు.

ఒక్కసారి రైలెక్కితే నేరుగా రాజమండ్రి వెళ్లే వరకు ఎలాంటి సమస్యా ఉండేది కాదు. కానీ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లోనే ఇద్దరూ డబ్బుల కట్టలున్న బ్యాగులతో పోలీసులకు దొరికిపోయారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురై అసలు విషయాలన్నీ చెప్పేశారు. తమ యజమాని కోడలు మాగంటి రూపకు అందజేయడానికే ఈ మొత్తం తీసుకెళ్తున్నట్టు విచారణలో అంగీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలే ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్న ఈ సమయంలో బాబు సన్నిహితుడు ఇలా దొరికిపోవడంతో కేసీఆర్ చేతికి బ్రహ్మాస్త్రం దొరికినట్టే అంటున్నారు. ఈ వ్యవహారంలో మురళీ మోహన్ బుక్కయినట్టేనని చెబుతున్నారు.

ఈ విషయంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా, మురళీమోహన్ పై కేసు నమోదు చేసినట్టు గురువారం సైబరాబాద్ పోలీసులు తెలిపారు. మురళీమోహన్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. వీరిలో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా, మురళీమోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...