Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఎమ్మెల్యే రోజాకి జగన్‌ ‘క్లాస్‌’ పీకారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

కేవలం.. అరగంటలోనే మేటర్‌ మొత్తం మారిపోయింది. రాజకీయ నాయకుల్ని ‘ఊసరవెల్లి’తో పోల్చుతుంటాంగానీ.. అలా పోల్చాల్సి రావడాన్ని ఊసరవెల్లి కూడా అవమానంగా భావిస్తుందేమో. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలూ ఒకే తాటి మీద వుంటారు మరి.. అదే మాట మార్చడంలో.

అసలు విషయానికొస్తే, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌ పర్సర్‌ రోజా, రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాయిదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపిని ఏకి పారేశారు. కరోనా తీవ్రత నేపథ్యంలోనే స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆ నిర్ణయం తీసుకున్నారు తప్ప, దీని వెనుకాల వైసీపీ కుట్ర ఏమీ లేదని వివరణ ఇచ్చేసుకున్నారు రోజా.

ఏమయ్యిందోగానీ, కాస్సేపటికే ఆమె మాట మార్చేశారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడ్డం పట్ల గుస్సా అయ్యారు. మళ్ళీ ఇక్కడ టీడీపీపై షరామామూలుగానే దుమ్మెత్తిపోసేశారు. ఇంతలోనే అంత మార్పు ఎలా సాధ్యమయ్యిందట.? అంటే, ‘నోటి దురుసుతనానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రోజా’ విషయంలో వైఎస్‌ జగన్‌ మరోమారు అసహనానికి గురయ్యారట.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అడ్డగోలుగా నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని సమర్థించడమేంటి.? అంటూ స్వయంగా ఎమ్మెల్యే రోజాకి క్లాస్‌ పీకారట వైఎస్‌ జగన్‌. దాంతో, క్షణం ఆలోచించకుండా.. వెంటనే ఇంకోసారి మీడియా ముందుకొచ్చి, ఈసారి జగన్‌ ఆలోచనలకు తగ్గట్టుగా రోజా మాట్లాడారంటూ వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.

ఏమో, జగన్‌ అలా క్లాస్‌ పీకారో లేదోగానీ.. పీకారన్న విషయం స్పష్టమయ్యేలా కొన్ని వీడియోలు అయితే సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్నాయి. అరగంట ముందు, అరగంట తర్వాత.. రోజాలో ఊహించని మార్పు.. అంటూ సంచరిస్తోన్న ఈ వీడియోలు పాపం, రోజమ్మని రాజకీయంగా తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. పదే పదే నారా లోకేష్‌ని ‘పప్పు’ అనే రోజా, ఈ మాట మార్చే నైజం గురించి ఎలా సమర్థించుకుంటారో మరి.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...