Switch to English

అభివృద్ధి, సంక్షేమమే ప్రాతిపదికగా జనసేన మేనిఫెస్టో

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇక వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నాయి. తాజాగా మేనిఫెస్టోల విడుదల కార్యక్రమం మొదలైంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ముందుంది.

బుధవారం ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమమే తమ నినాదాలుగా పేర్కొంటూ 22 పేజీల మేనిఫెస్టోను ఆవిష్కరించింది. ప్రజా సంక్షేమంలోనూ, సంపద పంపిణీలోనూ అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని స్పష్టంచేసింది. రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.8వేల పెట్టుబడి సాయంతోపాటు 60 ఏళ్లు పైబడిన సన్న, చిన్నకారు, కౌలు రైతులకు నెలకు 5వేల పింఛను అందిస్తామని పేర్కొంది.

అలాగే 58 ఏళ్లు పైబడిన చేనేత, మత్స్యకారులకు కూడా నెలకు రూ.5వేల పింఛను ఇస్తామని తెలిపింది. ఒకటి నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఇంటర్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇస్తామని ప్రకటించింది. రాయలసీమ, కోనసీమ అభివృద్ధికి తీసుకునే చర్యలను కూడా అందులో వివరించారు. వ్యవసాయంలో ఉన్నవారంతా లబ్ధి పొందేందుకు వీలుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కిందకు వ్యవసాయాన్ని తీసుకువస్తామని పేర్కొన్నారు. మొత్తం 96 హామీలను జనసేన తన మేనిఫెస్టోలో పేర్కొంది.

జనసేన మేనిఫెస్టోల ఇంకా ఏమున్నాయంటే..

రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపు సెట్లు

ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా

చేనేత వృత్తులవారికి అదనంగా మరో రూ.2 లక్షల బీమా

జిల్లా ఆస్పత్రులన్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులగా మార్పు

ప్రతి మండలంలో సంచార వైద్యశాల

గిరిజనుల వైద్యం కోసం ప్రతి ఐదు గ్రామాలకు ఒక అంబులెన్స్

ప్రతి మండలంలో ప్రభుత్వ వృద్ధాశ్రమాల ఏర్పాటు

బహుళ అంతస్తుల నిర్మాణాల ద్వారా ప్రజలందరికీ ఇళ్ల వసతి

వార్షిక కేలండర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ

ఆరు నెలల్లోపు బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ

అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు

స్థానిక సంస్థల్లో స్వయం ఉపాధి సంఘాల మహిళలకు ప్రాధాన్యం

ఆడపిల్ల పెళ్లి కోసం రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం

ఆడపడచులకు ఏటా రూ.10,001 విలువైన కానుక

పోలీసు శాఖలోని ఖాళీలన్నీ ఏడాదిలోగా భర్తీ.. కొత్తగా 25వేల పోస్టుల నియమాకం

మైనారిటీల అభివృద్ధి కోసం సచార్ కమిటీ సిఫార్సుల అమలు

రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో నెలకు నేరుగా రూ.2,500 నుంచి 3,500 నగదు జమ

కుటుంబ పరిమాణం ఆధారంగా ఏడాదికి 6 నుంచి 10 ఉచిత సిలండర్ల పంపిణీ

ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ రద్దు

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనాల అమలు

దివ్యాంగుల కోసం ప్రత్యేక పాఠశాలల ఏర్పాటు

పాక్షిక వికలాంగుల కుటుంబానికి నెలకు రూ.5వేలు, పూర్తి వికలాంగుల కుటుంబాలకు రూ.10వేల పెన్షన్

బీసీ రిజర్వేషన్లు 5 శాతం పెంపు.. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు

రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ప్రకారం కాపు రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...