Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: వైసీపీలో టీడీపీ కోవర్టులున్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

రాజకీయాలన్నాక కోవర్టులు సర్వసాధారణం. ఈ మధ్య ఆ కోవర్టు వ్యవహారాలు మరింత గట్టిగా జరుగుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల దగ్గర్నుంచి చాలా విషయాలు ఈ కోవర్టుల రాజకీయాల చుట్టూనే జరుగుతుంటాయి. అలాంటి కోవర్టుల కారణంగానే శాసన మండలిలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందా.? ఈ విషయమై వైఎస్సార్సీపీలో అంతర్గతంగా చాలా సీరియస్‌గా చర్చ జరుగుతోందట.

‘చాలా ముఖ్యమైన విషయాల్ని, చాలా సిల్లీగా లైట్‌ తీసుకున్నాం.. అదే ఇప్పుడు కొంప ముంచింది..’ అని ఓ ముఖ్య నేత ఒకరు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళితే, ‘మరి, ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు.?’ అని వైఎస్‌ జగన్‌, సదరు ముఖ్య నేతని నిలదీశారట.

మరోపక్క, పార్టీలో వైఎస్‌ జగన్‌ వద్దకు ఏ విషయాన్ని అయినా తీసుకెళ్ళాలంటే, కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయంటూ పార్టీలో సీనియర్‌ నేతలే ఆఫ్‌ ది రికార్డ్‌గా తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. నెల్లూరు జిల్లాకి చెందిన ఓ ‘రెడ్డిగారు’, తాను మొదటి నుంచీ జగన్‌ వెంటే వున్నా, తనను కాదని ఈ మధ్యనే వైసీపీలోకి వచ్చిన నేతలకి పదవులిచ్చారంటూ వాపోయిన విషయం విదితమే.

ఒకప్పుడు జగన్‌ని తిట్టినవాళ్ళే ఇప్పుడు ఆయన చుట్టూ కోటరీగా ఏర్పడి, కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని సదరు ‘రెడ్డి’గారు మాత్రమే కాదు, చాలామంది అభిప్రాయపడుతున్నారట. అయితే, ఈ విషయాల్ని బాహాటంగా చెప్పేందుకు మాత్రం ఎవరూ సాహసించడంలేదు. ఎందుకంటే, వైఎస్సార్సీపీకి సంఖ్యా బలం తిరుగులేని రేంజ్‌లో వుంది. పైకి పెదవి విరిస్తే.. రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్నది వారి వాదన.

‘జగన్‌కి ఇదొక హెచ్చరిక.. ప్రభుత్వం ఓడిపోవడమంటే అంతకన్నా అవమానకరం ఇంకోటుండదు.. కోవర్టులపై దృష్టిపెట్టాల్సిందే..’ అని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అర్థమయ్యేలానే సదరు సీనియర్లు, సమాచారాన్ని రకరకాల మార్గాల్లో అధినేత వద్దకు చేర్చే ప్రయత్నమైతే చేస్తున్నారట.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....