Switch to English

వైఎస్‌ జగన్‌ రివర్స్‌ గేర్‌: సరిలేరు నీకెవ్వరు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

శాసన మండలి రద్దు దిశగా అడుగులు పడుతున్నాయి. సోమవారం ఈ వ్యవహారంపై పూర్తి స్పష్టత వచ్చేయనుంది. ఈలోగా ‘హార్స్‌ ట్రేడింగ్‌’ ఏ స్థాయిలో జరగనుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరే, ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘అక్కసు’ అనే మాటకు తావు లేదు. అక్కసుతోనే శాసన మండలిని రద్దు చేయాలనుకుంటే, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చరిత్ర హీనుడిగా నిలిచిపోవడం ఖాయం.

మండలి నిర్వహణ ఖర్చు దండగ.. అని తేల్చేశారు వైఎస్‌ జగన్‌. అదీ శాసన సభలో. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది.? 60 కోట్లు ఖర్చవుతుందట మండలి కారణంగా ప్రభుత్వానికి.. అదీ ఏడాది సమయానికి. ఈ పేద రాష్ట్రానికి ఇంత ఖర్చు అవసరమా.? అంటూ అమాకంగా ప్రశ్నించేశారు వైఎస్‌ జగన్‌. ముఖ్యమంత్రిగా ఆయనెంత ‘పొదుపు’ ఆలోచనలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

మరి, ప్రభుత్వ పథకాలకు ప్రచారం మాటేమిటి.? వాటి కోసం ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయల నిధుల సంగతేంటి.? ఆ విషయం పక్కన పెడితే, మండలి విషయమై ఇంత ‘గొప్ప’ అభిప్రాయం ముఖ్యమంత్రికి వున్నప్పుడు, ఆ మండలికి తమ పార్టీ నుంచి ఎందుకు పలువుర్ని పంపినట్లు.? ఎన్నికల్లో ఓడిపోయినవారికీ మండలిలో అవకాశం కల్పించారు వైఎస్‌ జగన్‌. మండలి ద్వారా మంత్రులు అయినవారూ వున్నారు వైసీపీ ప్రభుత్వంలో. బహుశా అప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి, ‘ఖర్చు దండగ’ వ్యవహారం గుర్తుకు రాలేదేమో.

ఇలాంటివే, ఈ తొందరపాటు ప్రకటనలు, తొందరపాటు చర్యలే ప్రభుత్వం కొంప ముంచేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి వేరే శతృవు అవసరం లేదు. వైఎస్‌ జగన్‌ చెబుతున్న మాటలే ఆ పార్టీకీ, ప్రభుత్వానికీ అశనిపాతంలా మారేలా వున్నాయి. అన్నిట్లోనూ రివర్స్‌ గేర్‌ వేస్తే.. రేప్పొద్దున్న అదికారం కూడా రివర్స్‌ అయిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలుసుకోకపోతే ఎలా.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...