Switch to English

భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

నటీనటులు: శ్రీనివాస‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య‌, వెన్నెల‌కిషోర్, స‌త్యం రాజేశ్‌, ప్ర‌వీణ్‌ త‌దిత‌రులు
నిర్మాత – దర్శకత్వం: వై.శ్రీనివాస‌రెడ్డి
క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే: ప‌ర‌మ్ సూర్యాన్షు
సినిమాటోగ్రఫీ: భ‌ర‌ణి కె.ధ‌ర‌ణ్‌
మ్యూజిక్: సాకేత్ కొమండూరి
ఎడిటర్‌: అవుల వెంక‌టేశ్
విడుదల తేదీ: డిసెంబర్ 6, 2019

ఇప్పటివరకూ తెలుగు తెరపై కమెడియన్ గ అటుగా నవ్వించిన శ్రీనివాసరెడ్డి, ఇటీవలే హీరోగా కూడా పలు చిత్రాలతో నవ్వించాడు. ఇప్పుడు నటుడిగానే కాకూండా మెగాఫోన్ పట్టుకొని దర్శకుడిగా, నిర్మాతగా మారి చేసిన సినిమా ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ మేము ఒకరోజు ముందు చుసిన ప్రీమియర్ షో నుంచి మీకు ఈ రివ్యూ అందిస్తున్నాం. మరి సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు – ఈ సినిమా కథ ఉదయం మొదలై, సాయంత్రానికి ముగుస్తుంది.ఇక కథలోకి వెళితే.. శ్రీను(శ్రీనివాసరెడ్డి) నటుడిగా అవకాశాల కోసం చూస్తూ, తన లక్కీ నెంబర్ లాటరీ టికెట్స్ కొంటూ ఏదో ఒక రోజు లాటరీ తగిలి కోటీశ్వరుడు అవుతామని తన ఫ్రెండ్స్ జోజో(సత్య) – షకలక శంకర్(పీటర్)లకి చెబుతుంటాడు. డైరెక్టర్ రఘుబాబు తనని యు ట్యూబ్ లో స్టార్ ని చేస్తానని తన దగ్గర డబ్బులు నొక్కేస్తుంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు శ్రీను లాటరీ టికెట్ కి 2 కోట్ల లాటరీ తగులుతుంది. కానీ ఆ లాటరీ టికెట్ వీరి నుంచి మిస్ అవుతుంది. దానిని వెతికే క్రమంలో శ్రీను – జోజో – పీటర్ కథలోకి జర్నలిస్ట్ అయినా కోకిల(షాలు చౌరాస్య) ఎలా వచ్చింది? ఏసిపి స్వతంత్ర కుమార్(వెన్నెల కిషోర్) ఎలా వచ్చాడు? ఎలా వాళ్ళకి రసగుల్లాలు పెట్టి కబడ్డీ ఆదుకున్నాడు? అందరికంటే మించి శ్రీను అండ్ గ్యాంగ్ ఎలా కోబ్రా(చిత్రం శ్రీను) డ్రగ్ మాఫియాలో ఇరుక్కున్నారు? ఫైనల్ గా ఈ అన్ని చిక్కుముడులను విప్పుకొని ఎలా బయట పడ్డారు? అన్నదే కథ.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ – ఇదొక కామెడీ ఎంటర్టైనర్.. ఆ టాగ్ లైన్ పరంగా కామెడీ అనేది ఎక్కడా ఉందొ చెప్పాలంటే మనం డైరెక్ట్ గా సెకండాఫ్ కి వెళ్ళిపోదాం.. అందులో బతుకు జట్కా బండి – రచ్చ బండ ప్రోగ్రామ్స్ ని మిక్స్ చేసి స్పూఫ్ గా చేసిన ‘బతుకు ఎడ్ల బండి’ ఎపిసోడ్ అందరినీ బాగా నవ్విస్తుంది. ఈ సీన్ లో షకలక శంకర్ – ఝాన్సీ – రచ్చ రవిల పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా షకలక శంకర్ చూపించే నాలుగైదు షేడ్స్ సూపర్బ్. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో వెన్నెల కిషోర్ – సత్య మధ్య వచ్చే రసగుల్లా ఎపిసోడ్ కూడా ప్రేక్షకులని నవ్విస్తుంది.

ఇక నటీనటుల పరంగా చూసుకుంటే.. శ్రీనివాస రెడ్డి, సత్య, షకలక శంకర్, సత్యం రాజేష్, చిత్రం శీను, నవీన్ నేని తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. అంతకు మించి స్పెషల్ గా చెప్పుకోవాల్సిన పెర్ఫార్మన్స్ ఒక్కరిదీ కూడా లేదు. వెన్నెల కిషోర్ పాత్రని రామ్ గోపాల్ వర్మని స్ఫూర్తిగా తీసుకొని చేయడం వలన కొంచం డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటాడు.

ఆఫ్ స్క్రీన్:

అక్కడక్కడా అవసరమై చేసిన ఆర్ట్ వర్క్ తప్ప టెక్నికల్ చెప్పుకోవడానికి ఏం లేవు..

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పుకున్న ఈ సినిమాలో కామెడీనే లేదు, సరే టీం ప్రకారం ఆలోచిస్తే.. వాళ్ళు ఏదైతే కామెడీ అని రాసుకున్నారో, ఇది అద్భుతంగా ఉంటుందని తీశారో అవేమీ వర్కౌట్ అవ్వకపోగా ప్రేక్షకులకి పరమ బోర్ గా అనిపిస్తాయి. ఇకపోతే ‘మంచి రసగుల్లా లాంటి సినిమా’ అన్నారు. స్వీట్ లేని, వాలిడిటీ అయిపోయిన రసగుల్లా ఎంత టేస్ట్ లెస్ గా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా.. సినిమా పరంగా చూసుకుంటే.. మెగాస్టార్ చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ స్పూఫ్ తో సినిమా మొదలవుతుంది. అక్కడ విజిల్స్ కొట్టిన ఆడియన్ మళ్ళీ చివరి దాకా విజిల్ వేయడు, ఎందుకంటే వాళ్ళు వెయ్యాలనుకున్నా వేసేంత సీన్స్ లేదు గనక. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోరింగ్ గా, చాలా డల్ గా సాగుతుంది. ముఖ్యంగా వాళ్ళు దుగ్స్ తీసుకున్నప్పటి నుంచీ పూర్తి ఇల్లాజికల్ గా ఎలా అనిపిస్తే అలా వెళ్తుంటుంది. సెకండాఫ్ లో మొదటి 20 నిమిషాలు పరవాలేధనిపించినా ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతుంది. ఇక క్లైమాక్స్ అయితే మాకు అవసరం లేదని ముందే వెళ్ళిపోయేంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది తప్ప, కన్ఫ్యూజన్ కామెడీ జనరేట్ అవ్వలేదు.

ఆఫ్ స్క్రీన్:

సినిమాకి హీరో కథ, సో అక్కడినుంచి మోదము పెడితే.. ఇందులో ఇది కథ అని చెప్పుకోవడానికి ఏం లేదు, పోనీ ఏదో ఒక పాత్ర ఎమోషన్ మీదైనా కథని నడిపించాడా అంటే అదీ లేదు.. పోనీ ఇదొక స్పూఫ్ సినిమా లేదా ఇదొక కామెడీ సినిమా లేదా ఇదొక రియాలిటీ సినిమా అంటే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి.. ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు ఏం తీయాలనుకున్నారో.. ఎందుకంటే కథ ఈ జానర్లో ఉంటుంది అంటే చెప్పలేం. అలా కథ విషయంలోనే మొదటి రాంగ్ స్టెప్ పడడం వలన అదే తప్పు స్క్రీన్ ప్లే లోనూ జరిగింది. కథనం చాలా బోరింగ్ గా, ప్రతిదీ మీరు ఊహించేలా ఉంటుంది. ఇక డైలాగ్స్ సోషల్ మీడియా హాపెనింగ్స్, బయట జరుగుతున్న విషయాల నుంచి తీసుకుని రాశారు. అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ ఇచ్చిన ప‌ర‌మ్ సూర్యాన్షు వర్క్ అంటా ఒక ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఇలాంటి స్పూఫ్ కానీ స్పూఫ్ లని 10 నిమిషాల వీడియోల రూపంలో యూట్యూబ్ లో చూస్తున్నాం.

ఇక దర్శకుడిగా పరిచయం అవుదాం అనుకున్న స్టార్ కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఏం చూసి ఈ కథని దర్శకనిర్మాతగా బాధ్యతలు తీసుకున్నాడు అనేది మిస్టరీ అనే చెప్పాలి. కథలోని ఈ సినిమాలో పేపర్ మీద ఆయనకి కామెడీ బాగా అనిపించి దీనిని టేకప్ చేసి ఉంటే మాత్రం ఆయన పూర్తిగా ఫెయిల్ అయినట్టే అని చెప్పాలి. ఎందుకంటే పేపర్ మీద ఉన్న దానిని తెరపైన ఆవిష్కరించడంలో ఆయన సక్సెస్ కాలేదు. ఎందుకంటే ప్రేక్షకులు ఎంటర్టైన్ కాలేదు బోర్ ఫీల్ అయ్యారు. నిర్మాతగా ప్రొడక్షన్ డిజైనింగ్ జస్ట్ ఓకే. భ‌ర‌ణి కె.ధ‌ర‌ణ్‌ సినిమాటోగ్రఫీ అంతగా లేదు. చాలా చోట్ల ఫోకస్ అవుట్ లు కనిపిస్తాయి. కలరింగ్ కూడా ఇష్టం వచ్చినట్టు మారిపోతుంటుంది. సాకేత్ కొమండూరి ట్యూన్స్ ఏవీ మనతో ట్రావెల్ అవ్వవు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఐతే పెద్ద కష్టపడలేదు.. యు ట్యూబ్ లో వినపడే ట్యూన్స్ వాడేశారు. ఆవుల వెంకటేష్ ఎడిటింగ్ కూడా అంతంతమాత్రమే అని చెప్పాలి.

విశ్లేషణ:

కమెడియన్ గా ప్రయాణం మొదలు పెట్టి స్టార్ కమెడియన్ హోదాలో సినిమాలు చేస్తూ, ఇటీవలే ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’, ‘ఆనందో బ్రహ్మ’ సినిమాలతో హీరోగా కూడా సక్సెస్ అందుకున్న శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా మారి చేతులు కాల్చుకున్న సినిమా ‘భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు’. హీరోగా, నిర్మాతగా కూడా వ్యవహరించిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో ప్రేక్షకులని నవ్వించలేకపోవడమే సినిమాకి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. కమెడియన్ గా ఒకరు రాసిన పాత్రలో నవ్వించడం వేరు, ఆయనే డైరెక్టర్ అయినప్పుడు సిల్వర్ స్క్రీన్ కి పనికివచ్చే కామెడీ ఇది అనే విషయంలో జడ్జ్ మెంట్ కరెక్ట్ గా లేకపోవడం వలన, శ్రీనివాసరెడ్డి పోస్టర్ చూసి మంచిగా నవ్వుకోవచ్చు అనే ఫీలింగ్ లో వచ్చే ఆడియన్స్ ని నిరుత్సాహపరుస్తుంది. ‘మంచి రసగుల్లా లాంటి సినిమా’ అనే టాగ్ లైన్ చూసి వెళ్ళిన ప్రేక్షకులు ‘ఇంత బాడ్ గా ఉంటుందా రసగుల్లా’ అనే ఫీలింగ్ లో బయటకి వస్తారు. రెండు, మూడు సీన్లలో నవ్వించి, మిగతా అంతా బోర్ కొట్టించే సినిమా ఇది.

ఫైనల్ పంచ్: భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు – రుచీ పచీ లేని రసగుల్లా ఇది.!

తెలుగుబుల్లెటిన్.కామ్ రేటింగ్: 1/5

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...
నటీనటులు: శ్రీనివాస‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య‌, వెన్నెల‌కిషోర్, స‌త్యం రాజేశ్‌, ప్ర‌వీణ్‌ త‌దిత‌రులు నిర్మాత - దర్శకత్వం: వై.శ్రీనివాస‌రెడ్డి క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే: ప‌ర‌మ్ సూర్యాన్షు సినిమాటోగ్రఫీ: భ‌ర‌ణి కె.ధ‌ర‌ణ్‌ మ్యూజిక్: సాకేత్ కొమండూరి ఎడిటర్‌: అవుల వెంక‌టేశ్ విడుదల తేదీ: డిసెంబర్ 6, 2019 ఇప్పటివరకూ తెలుగు తెరపై కమెడియన్ గ అటుగా నవ్వించిన శ్రీనివాసరెడ్డి, ఇటీవలే హీరోగా కూడా పలు చిత్రాలతో నవ్వించాడు. ఇప్పుడు నటుడిగానే కాకూండా మెగాఫోన్...భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీ రివ్యూ