Switch to English

సోష‌ల్ మీడియా జిందాబాద్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

డప్పు వాయిద్యాల దండు ముందు నడుస్తుండగా వెనుక అభ్యర్థి, ఆయన చుట్టూ ప్రచార సామగ్రి, జెండాలు పట్టుకున్న కార్యకర్తలు.. ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మాట్లాడి, చేతిలో చేయి వేసి ఓటడిగి, కుదిరితే అలయ్‌బలయ్‌.. ఎన్నికల ప్రచారమనగానే కొన్నేళ్ల వరకు కనిపించిన దృశ్యమిదీ. పల్లెలు, పట్టణాల్లో ఇదే తరహాలో జరిగేది.

కానీ ఇప్పుడు ప్రచారం తీరు మారింది. ఇంటింటి ప్రచారం దాదాపు కనుమరుగవుతోంది. ప్రచారం చేసే అభ్యర్థులను ఇంటి ముందుకొచ్చి చూసే జనం కరువవుతున్నారు. మైకు సౌండు వినిపించగానే తలుపులేసి లోపలే కూర్చుంటున్నారు. నేరుగా జనాన్ని కలిసి ఓటు అడిగే పరిస్థితి హైద‌రాబాద్ కాలనీల్లో దాదాపు కనుమరుగైంది.

అభ్యర్థి పాదయాత్రతో వస్తే చూసే జనమే లేకుండా పోవటంతో వారు తీరు మార్చుకోక తప్పలేదు. సంప్రదాయ ప్రచారం కంటే సామాజిక మాధ్యమ ప్రచారమే ఎక్కువగా జనానికి చేరుతోందని దాదాపు తేలిపోయింది. దీంతో ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రచారం ఊపందుకుంది.

సోషల్‌ మీడియా ప్రచారానికి ప్రధాన అభ్యర్థులంతా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరిని నెల రోజుల కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకున్నారు. ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.50 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం.

గతంలో ఎంపీగానో, ఎమ్మెల్యేగానో ఉన్నవారు వారి పదవీ కాలంలో చేసిన పురోగతి, ప్రజల పక్షాన చేపట్టిన కార్యక్రమాలు, ఇప్పుడు గెలిస్తే చేయబోయే పనులు, ఊరువాడా అభివృద్ధికి వేసుకున్న ప్రణాళికలు, వారు పోటీ చేస్తున్న పార్టీ ఘనత, రాజకీయ నేపథ్యం ఉన్నవారు వారి పూర్వీకులు చేసిన కార్యక్రమాలు.. ఇలా వీలైనన్ని వీడియోలు రూపొందించి వాట్సాప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్‌లకు చేరవేస్తున్నారు.

కొందరైతే ఏకంగా త్రీడీ చిత్రాలు రూపొందించి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైరి పక్షాలను విమర్శించేందుకు ఎక్కువగా దీన్ని వాడుకోగా, ఈసారి తమ గురించి ఎక్కువగా చెప్పుకునేందుకే ప్రాధాన్యమిస్తుండటం విశేషం. చూడాలి ప్ర‌చారం ఇంకా ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...