Switch to English

జగన్‌ – చిరంజీవి మీటింగ్‌: పవన్‌పై ఎఫెక్ట్‌ ఎంత.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో మెగాస్టార్‌ చిరంజీవి సమావేశమయ్యాక.. మెగా అభిమానుల్లో పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ సినిమాల్లో నటించడం బెటర్‌.. అన్న అంశం చుట్టూ చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో వున్నన్నాళ్ళూ చిరంజీవి చాలా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. చిరంజీవి వ్యక్తిగత జీవితం మీద అడ్డగోలు విమర్శలు చేశారు చాలామంది.

కానీ, ఇప్పుడు చిరంజీవి ‘అందరివాడు’ అయిపోయారు.. ఎందుకంటే, ఆయన రాజకీయాల్లో లేరు గనుక. అంటే, రాజకీయాల్లోకి రాగానే ‘బురద’ చల్లేయాల్సిందేనన్నమాట. పవన్‌ కళ్యాణ్‌ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఒకవేళ పవన్‌ కళ్యాణ్‌ కూడా కొన్నాళ్ళపాటు రాజకీయాల్ని పక్కన పెట్టి సినిమాల్లోకి వెళితే.. ఆయన మళ్ళీ ‘అందరివాడు’ అయిపోవడం ఖాయం.. అన్నది కొందరి వాదన.

అయితే, పవన్‌ కళ్యాణ్‌ ఆలోచనలు వేరు.. చిరంజీవి ఆలోచనలు వేరు. పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు పవన్‌ కళ్యాణ్‌తో సినిమాలు చేయాలనుకుంటున్న మాట వాస్తవం. కానీ, పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలపై ఖచ్చితమైన అవగాహనతో వున్నారు. వెన్నుపోటు రాజకీయాలు రాజ్యమేలుతున్న వేళ, ఎవరు తనను విడిచి పోతున్నా పవన్‌ కళ్యాణ్‌ పట్టించుకోవడంలేదు.

ఎందుకంటే, పవన్‌ కళ్యాణ్‌ వెంట లక్షలాదిమంది అభిమానులున్నారు. ఆ అభిమానుల లెక్కలు చాలా పక్కాగా వున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా ఆయన వెన్నంటే వుంటామంటున్నారు. చిరంజీవి – జగన్‌ భేటీని కేవలం ‘సినిమా’ సంబంధిత వ్యవహారంగానే చూడాలన్నది మెగా అభిమానుల వాదన. మెగా అభిమానుల్లోనే భాగమైన పవన్‌ అభిమానులదీ ఇదే అభిప్రాయం.

పవన్‌ కళ్యాణ్‌తో తొలుత అన్ని విషయాలూ చర్చించి, ఆ తర్వాత జగన్‌తో భేటీని చిరంజీవి ఖరారు చేసుకున్నారంటేనే విషయం క్లియర్‌గా కన్పిస్తోంది. జగన్‌తో తన భేటీ, జనసేన పార్టీపై ఎలాంటి ప్రభావం చూపదన్న ఖచ్చితమైన అంచనాలు చిరంజీవికీ వున్నాయి. అయితే, ఈ భేటీ తర్వాత.. పవన్‌, సినిమాల్లో నటించడానికి కొంత మార్గం సుగమం అవుతుందనీ.. సినిమాల్లో నటించడం వల్ల అడ్వాంటేజ్‌ని చిరంజీవి స్వయంగా తన తమ్ముడికి ఈ భేటీతో తెలియజేశారనీ వ్యక్తమవుతున్న అభిప్రాయాల్ని ఎలా కాదనగలం.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...