కృష్ణవంశీ .. టాలీవుడ్ లో క్రియేటివ్ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ దర్శకుడికి ఈ మధ్య టైం అస్సలు బాగోలేదు. చందమామ సినిమా తరువాత వరుస పరాజయాలతో టెన్షన్ పడుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నక్షత్రం సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదన్నది అసలు నిజం.
అయితే త్వరలోనే కృష్ణవంశీ ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ సారి అయన చేసే సినిమా లేడి ఓరియెంటెడ్ కథతో ఉంటుందని టాక్. ఇందులో హీరోయిన్ గా చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ నటిస్తుందట. ఈ మధ్య కాలంలో అటు అవికా గోర్ పరిస్థితి అలాగే ఉంది .. ఆమెతో కృష్ణవంశీ ఎందుకు ఇలాంటి డేరింగ్ స్టెప్ వేస్తున్నాడో మరి.
ఈ సినిమాలో రమ్యకృష్ణ,ప్రకాష్ రాజ్ కూడా నటిస్తారని, మరోవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టిన కృష్ణవంశీ కి నిర్మాతలకు మధ్య బడ్జెట్ సమస్య వచ్చిందని టాక్. కృష్ణవంశీ చెప్పిన బడ్జెట్ కాకుండా కొంతవరకు తగ్గిస్తే సినిమా చేయడానికి నిర్మాతలు రెడీ గా ఉన్నారు. మరి కృష్ణవంశీ ఈ విషయంలో కాంప్రమైజ్ అవుతాడా లేదా అన్నది చూడాలి.
979291 888205Sweet internet internet site , super pattern , quite clean and utilize friendly . 663331
89176 9990Gratitude for building this send! I in reality recognize the no cost information. 323916
231780 244271Thrilled you desire sensible business online guidelines keep wearing starting tools suitable for the specific web-based business. cash 117578