Switch to English

ఎల్లలు దాటిన ఆనందం – చిరంజీవికి పద్మ విభూషణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వెండితెర రారాజులా.. మెగా మహారాజులా.. ‘స్వయంకృషి’కి చిరునామాలా.. అభిమానుల ‘విజేత‌’గా.. అన్నార్తులకు అపద్బాంధవుడుగా.. అభిమానులకు అన్నయ్యగా.. అనుభవంలో మాస్టర్‌గా.. హోల్ ఇండ‌స్ట్రీకి మెగాస్టార్‌గా ఎదిగిన నిలువెత్తు సినీ శిఖ‌రం చిరంజీవిని భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో గౌర‌వించింది. అత్యున్న‌త గౌర‌వం అందుకున్న చిరంజీవికి అదే స్థాయిలో శుభాకాంక్ష‌లు తెలిపారు తెలుగు ఎన్నారైలు. ప్ర‌ఖ్యాత‌ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరంజీవి సినీ లైఫ్ జ‌ర్నీ వీడియోను ప్ర‌ద‌ర్శించారు. ఈ అరుదైన స‌న్నివేశం అంద‌రిని ఆక‌ట్టుకుంది. మెగా అభిమాని, తెలుగు ఎన్నారై రాజ్ అల్లాడ ఆధ్వర్యంలోని నిర్వ‌హించిన‌ ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ఎన్నారైల సంఘాల ప్ర‌తినిధులు పాల్గొని కేక్ క‌ట్ చేసి చిరంజీవికి శుభాకాంక్ష‌లు అందించారు. త‌మ అభిమాన హీరో చిరంజీవి భ‌విష్య‌త్‌లో భార‌త అత్యున్న‌త పుర‌స్కారం భార‌తర‌త్న అందుకోవాల‌ని ఆకాంక్షించారు.

ఎల్లలు దాటిన ఆనందం – చిరంజీవికి పద్మ విభూషణ్

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరంజీవి సినిమాల్లోని దృశ్యాల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఆ స‌మ‌యంలో ”స్టార్.. స్టార్.. మెగాస్టార్..” అంటూ ఆ ప్రాంగ‌ణ‌మంతా అభిమానుల నినాదాల‌తో హోరెత్తిపోయింది. ఇక ప్ర‌జాసేవ కేట‌గిరిలో పద్మవిభూషణ్ అందుకున్న వెంక‌య్య‌నాయుడుకు కూడా తెలుగు ఎన్నారైలు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ నుంచి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లు ఎన్నారైల తెలుగు సంఘాలు NATS, MATA, Atmiya, AptA, TANA, NATA, AAA, NRIVA, TTA, NASAA, TFAS, ISANA సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మెగా గ్రూప్ లీడ‌ర్స్.. ఓం ప్ర‌కాశ్ నక్కా, విజయ్ రామిశెట్టి, బుల్లి కనకాల, గోపికృష్ణ గుర్రం, ఆనంద్ చిక్కాల, వెంకట్ నాగిరెడ్డి, లక్ష్మణ్ నాయుడు, అనిల్ కుమార్ వీరిశెట్టి, వంశీ కొప్పురావూరి తమ సహాయ సహకారాలు అందించారంటూ వారికి రాజ్ అల్లాడ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...