Switch to English

‘బెదరులంక 2012’ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది – హీరో కార్తికేయ.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. థియేటర్లలో శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ ”మా సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసిన, మాకు ఎంతో మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు థాంక్స్. సక్సెస్ వచ్చినప్పుడు, మనం అనుకున్న సినిమా హిట్ అయినప్పుడు… సినిమాలు వస్తాయి. మంచి కథలు వస్తాయి. అవి పక్కన పెడితే… ‘బెదరులంక 2012’ విజయం జీవితంలో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ కథ విన్న తొలి రోజు నుంచి ఏది అయితే కథలో వర్కవుట్ అవుతుంది? ప్రేక్షకులకు నచ్చుతుంది? అనుకున్నానో… వాటికి మంచి పేరు వచ్చింది. సెకండాఫ్ అంతా నవ్వుతూ ఉన్నామని, చివరి 45 నిమిషాలు నవ్వుతూనే ఉన్నామని ముక్త కంఠంతో అందరూ చెబుతున్నారు. సీరియస్ విషయాన్ని వినోదంతో చెప్పడం ఇంతకు ముందు చూడలేదు. అటువంటి కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలపై మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను థియేటర్లకు వెళ్లాను. హౌస్ ఫుల్ కావడం చూసి సంతోషం వేసింది. దర్శకుడు ఇతనే అని క్లాక్స్ ని పరిచయం చేయగా… అందరూ  క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు మెం రిలాక్స్డ్ గా ఉన్నాం. నాకు ఈ సినిమా ఇచ్చిన నిర్మాత బెన్నీ గారికి థాంక్స్. మా టీమ్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. నేహా శెట్టి ఒక ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల ఇక్కడికి రాలేకపోయింది. మా ట్రైలర్‌ విడుదల చేసిన రామ్‌ చరణ్‌ గారికి థాంక్స్‌. నా ఇన్స్‌పిరేషన్‌, ఈ సినిమాలో ఆయన పేరు శివ శంకర వరప్రసాద్‌ అని పెట్టుకున్నా. నాకు ఎంతో సపోర్ట్‌ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు థాంక్స్‌” అని అన్నారు.

బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ ”మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు, మా సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. మా సినిమా విజయవంతం కావడం సంతోషంగా ఉంది” అని అన్నారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ”సక్సెస్ అయ్యాక ఏం మాట్లాడాలో నాకు తెలియదు. నా కథను నమ్మిన బెన్నీ గారికి, కార్తికేయ గారికి, మా టీం అందరికీ థాంక్స్. సాయి ప్రకాష్, సన్నీ కూరపాటి… మా సినిమాటోగ్రాఫర్లకు, మణిశర్మ గారికి కూడా థాంక్స్. మా సినిమా ‘బెదురులంక 2012’లో సెకండాఫ్ బావుందని, నవ్వుతున్నారని అంతా చెబుతున్నారు. ఈ విజయం వెనుక టెక్నీషియన్లు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా థాంక్స్. ఇప్పుడు స్క్రీన్స్ పెంచుతున్నారని చెబుతున్నారు. మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. కార్తికేయ, నేహా శెట్టి నాకు ఫ్రెండ్స్. వాళ్ళతో పని చేయడం కంఫర్టబుల్. నాకు తొలి అవకాశం ఇచ్చిన మా నిర్మాత బెన్నీ గారికి థాంక్స్” అని అన్నారు.

‘ఆటో’ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ”నా జీవితంలో ఫస్ట్ సక్సెస్ మీట్ ఇది. నేను చాలా హిట్ సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు చేశా. పోస్టర్ లో నా ఫోటో కూడా ఉన్న సినిమా ఇది. దర్శకుడు క్లాక్స్ నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ కోసం వెంటాడతా. ట్రైలర్ విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. కార్తికేయ బాగా చేశారు. ఆయన ఫ్రెండ్లీ హీరో. ఆర్టిస్టులకు సపోర్ట్ చేస్తూ బాగా మాట్లాడతారు. ఇంత మంచి సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసినందుకు సంతోషంగా ఉంది” అని అన్నారు.

నటుడు రాజ్ కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ ”నన్ను ఈ సినిమాకు రిఫర్ చేసిన బెన్నీ గారికి థాంక్స్. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శకుడు క్లాక్స్ గారికి కూడా థాంక్స్. ‘ఆర్ఎక్స్ 100’ చూసి కార్తికేయకు ఫ్యాన్ అయ్యా. ఆయన ఎంపిక చేసుకునే కథలు బావుంటాయి. ఆయనతో పని చేయడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులు అందరూ ‘బెదురులంక 2012’ థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు” అని అన్నారు.
నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ ”రామ్ గోపాల్ వర్మ దగ్గర క్లాక్స్ పని చేస్తున్నప్పుడు ఆయన్ను కలిశా. నాకు మంచి వేషం ఇచ్చినందుకు థాంక్స్. ‘చావు కబురు చల్లగా’లో కార్తికేయతో నటించా. సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు అతనిలో ఉన్నాయి. బెన్నీ గారు చాలా సైలెంట్. ఆయనకు బోలెడు డబ్బులు కావాలి. మా సినిమాకు ప్రేక్షక దేవుళ్ళు వచ్చి చూడాలని, ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత దుర్గాతో పాటు చిత్ర బృందంలోని కీలక సభ్యులు ‘బెదరులంక 2012’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ‘ఇదే నా బుజ్జి..’ కల్కి 2898 AD ఈవెంట్లో పరిచయం...

Prabhas: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్...

Pawan Kalyan: చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ‘స్వామినాయుడు’కు జనసేనాని అభినందనలు

Pawan Kalyan: అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడును జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. ఏపీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో విస్తృతంగా...

Karthikeya: పాన్ ఇండియా స్థాయిలో కార్తికేయ ‘భజే వాయు వేగం’ విడుదల

Karthikeya: హీరో కార్తికేయ గుమ్మకొండ (Karthikeya) నటించిన కొత్త సినిమా ‘భజే వాయు వేగం’ (Bhaje vayu vegam). ఐశ్వర్య మీనన్ హీరోయిన్. ప్రశాంత్ రెడ్డి...

Ram Charan: రామ్ చరణ్ రేంజ్.. విస్తుగొలుపుతున్న ఆస్తుల విలువ..!

Ram Charan: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ (Ram Charan) తెలుగులోనే కాదు.. జాతీయ, అంతర్జాతీయ...

Kamakshi: ‘బోల్డ్ సీన్స్ అయితే ఏంటీ.. నటిస్తా..’ హీరోయిన్ కామెంట్స్ వైరల్

Kamakshi: ప్రియురాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla). అయితే.. విరుపాక్ష, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్, రౌడీ బాయ్స్, ఓం...

రాజకీయం

Pawan Kalyan: చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ‘స్వామినాయుడు’కు జనసేనాని అభినందనలు

Pawan Kalyan: అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడును జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. ఏపీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేసి జనసేనకు అండగా నిలిచినందుకు...

AP News: పిన్నెల్లికి 7ఏళ్ల శిక్ష పడొచ్చు.. 10సెక్షన్ల కింద కేసులు: సీఈఓ మీనా

AP News: ఏపీలో పోలింగ్ రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎంను ధ్వంసం చేయడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు పిన్నెల్లి అరెస్టుకు...

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే.! దొంగలు పడ్డ ఆర్నెళ్ళకి.!

‘మాచర్ల నియోజకవర్గం’ పేరుతో ఓ సినిమా వచ్చింది కొన్నాళ్ళ క్రితం. నితిన్ హీరో.! సినిమా కదా, కాసిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయ్. కానీ, మాచర్ల నియోజకవర్గంలో జరిగే రాజకీయ హింస మాత్రం నిజం....

ఏపీ ఎలక్షన్స్: 10 వేల పైన మెజార్టీ 92 స్థానాల్లో.!

ఒకప్పుడు ఎన్నికలకు సంబంధించి ముందస్తు సర్వేలు నిర్వహించాలంటే, అదో పెద్ద తతంగం. ఇప్పుడు అంత సీన్ అవసరం లేదు. శాంపిల్స్ తీసుకోవడం చాలా తేలిక. ఎన్నికల ముందర అయినా, ఎన్నికల పోలింగ్ రోజున...

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్ రేంజ్.. విస్తుగొలుపుతున్న ఆస్తుల విలువ..!

Ram Charan: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ (Ram Charan) తెలుగులోనే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రస్తుతం...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన ఇదే

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రముఖ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...