Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 22 ఆగస్ట్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజం శ్రావణం

సూర్యోదయం: ఉ.5:47
సూర్యాస్తమయం: రా.6:19 ని.లకు
తిథి: నిజ శ్రావణ శుద్ధ షష్ఠి రా.10:18 ని.వరకు తదుపరి నిజ శ్రావణ శుద్ధ సప్తమి
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము: స్వాతి తె.4:46 ని.వరకు తదుపరి విశాఖ
యోగం: శుక్లం రా.8:21 ని. వరకు తదుపరి బ్రహ్మం
కరణం: కౌలవ ఉ.10:06 ని. వరకు తదుపరి తైతుల
దుర్ముహూర్తం: ఉ.8:17 ని.నుండి 9:07 ని. వరకు తదుపరి రా.10:54 నుండి 11:40 ని.వరకు
వర్జ్యం : ఉ.9:38 ని.నుండి 11:17 ని‌. వరకు
రాహుకాలం: మ.3:00 గం నుండి 4:30 ని.వరకు
యమగండం: ఉ.9:00 గం నుండి 10:30 ని.వరకు
గుళికా కాలం: మ.12:19 నుండి 1:52 ని‌. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:28 ని.నుండి 5:16 ని.వరకు
అమృతఘడియలు: రా.7:36 ని. నుండి 9:16 ని.వరకు
అభిజిత్ ముహూర్తం :ఉ.11;54 ని. నుండి మ.12:44 ని.వరకు

ఈ రోజు (22-08-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానం అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట మరింత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

వృషభం: కీలక నిర్ణయాలలో సన్నిహితుల సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనుల్లో చికాకులు పెరుగుతాయి. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు.

మిథునం: కుటుంబసభ్యులతో స్వల్ప మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: కుటుంబ సమస్యలు మరింత నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా సాగవు. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ఉద్యోగ, ప్రయత్నాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు.

సింహం: చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: ఇతరులతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనులు శ్రమతో కొన్ని పూర్తవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

తుల: ముఖ్యమైన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. నూతన వాహన యోగం ఉన్నది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి వివాదాలపై కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చికం: ఇంటాబయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఆరోగ్య అభివృద్ధి చేయడం మంచిది కాదు. బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కొంత మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు.

ధనస్సు: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. అధికారులతో చర్చలు ఫలిస్థాయి.

మకరం: నిరుద్యోగుల యత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. సోదరుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

కుంభం: కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో విభేదాలు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు చెయ్యటం మంచిది కాదు. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరిగి విశ్రాంతి ఉండదు. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

మీనం: కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత మందకొడిగా సాగుతుంది. ధన వ్యవహారాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...