Switch to English

టీమిండియా ఓటమికి కోహ్లీనే కారణమా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరడం ఖాయమని, కప్ కూడా కొట్టుకురావడం గ్యారెంటీ అని సగటు భారత క్రీడాభిమాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కోట్లాది మంది భారతీయులు ఆ మధుర క్షణాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ సెమీస్ పోరులో భారత జట్టు అనూహ్యంగా ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో క్రీడాలోకం నివ్వెరపోయింది. గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులారా ఓటమి కొని తెచ్చుకున్నారని భారత క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు.

భారత ఓటమికి వరుణుడే కారణమంటూ పలువురు ఆ నెపాన్ని వర్షంపై నెట్టేశారు. కానీ టీమిండియా ఓటమికి జట్టులో ఉన్న అంతర్గత విభేధాలే కారణమనే వార్తలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సెలక్షన్ కమిటీ వ్యవహార శైలి వల్లే టీమిండియాకి ఈ పరిస్థితి ఎదురైందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిభ ఆధారంగా కాకుండా తమకు నచ్చినవారిని జట్టులోకి తీసుకోవడం వల్లే కోట్లాది మంది భారతీయుల ఆశలు అడియాసలు అయ్యాయని అంటున్నారు. స్టార్ ప్లేయర్లు మినహా మిగిలిన ఏ ఆటగాడైనా జట్టులోకి రావాలంటే కోహ్లీ మద్దతు ఉండాల్సిందేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ప్రపంచకప్ టోర్నీకి జట్టు ఎంపిక చేసినప్పుడే విమర్శలు వచ్చాయి. అంబటి రాయుడు, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేయకుండా ఏ మాత్రం ప్రభావం చూపలేని విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్ లను ఎంపిక చేయడంపై చాలామంది ఆశ్చర్యపోయారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కావాలనే అంబటి రాయుడిని జట్టులోకి ఎంపిక చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో వైదొలిగినా రాయుడికి అవకాశం రాకుండా చేయడంలో ప్రసాద్ కీలకంగా వ్యవహరించారని విమర్శలు చెలరేగాయి. చివరకు విజయ్ శంకర్ ని తప్పించినా.. తనకు పిలుపు రాకపోవడంతో రాయుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. రాయుడి విషయంలో కోహ్లీ కూడా సానుకూలంగా లేడనే టాక్ వినపడుతోంది. అందువల్లే రెండుసార్లు అవకాశం వచ్చినా రాయుడిని పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. కోహ్లీ మద్దతు ఉండటం వల్లే కేఎల్ రాహుల్ జట్టులో కొనసాగగలిగాడని చెబుతున్నారు.

కోచ్ రవిశాస్త్రి కూడా జోక్యం చేసుకోవడంతో జట్టు తుది కూర్పు దెబ్బతిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వ్యవహారాలన్నీ టీమిండియా రెండు గ్రూపులుగా విడిపోవడానికి కారణమయ్యాయని.. ఒక గ్రూప్ కి కోహ్లీ, మరో గ్రూప్ కి రోహిత్ శర్మ నాయకత్వం వహించారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. సెమీస్ లో కివీస్ తో ఓటమి తర్వాత భారత డ్రెస్సింగ్ రూంలో రెండు గ్రూపుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగిందని అంటున్నారు.

జట్టు ఎంపిక, కోచ్ జోక్యం తదితర పరిణామాలపై రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు జట్టు ఓటమిపై సమీక్షించడానికి బీసీసీఐ సిద్ధమైంది. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి తదితరులపై ప్రశ్నల వర్షం కురిపించనుంది. ఈ మేరకు వారిని సన్నద్దంగా ఉండాలంటూ సమాచారం పంపింది. నిజంగా అంతర్గత విభేదాలు, రాజకీయాల కారణంగానే జట్టు ఓడిపోయి ఉంటే, అందుకు బాధ్యులైనవారు ఎవరైనా సరే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. కోట్లాది మంది క్రీడాభిమానుల ఆశలు అడియాసలు కావడానికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టకూడదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...