Switch to English

Vizag: రాజధానిగా విశాఖ.! ఈ ‘ప్రచార పైత్యం’ ఇంకెన్నాళ్ళు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

Vizag: కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్నం.. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం.. అసలు సిసలు రాజధానిగా విశాఖపట్నం మాత్రమే.!

బహుశా ఊసరవిల్ల కూడా ఇన్ని మాటలు మార్చదేమో.! విశాఖపట్నం అంటే, ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో హైద్రాబాద్ తర్వాత ఆ స్థాయి వున్న నగరం విశాఖపట్నం మాత్రమే. భిన్న సంస్కృతులకు నిలయం విశాఖపట్నం. తూర్పు నావికాదళం.. అనేక జాతీయ స్థాయి సంస్థలు.. చెప్పుకుంటూ పోతే, విశాఖ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు.

అన్నిటికంటే మిన్నగా, విశాఖ ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా. విశాఖ బీచ్.. విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రకృతి రమణీయత.. వెరసి, పెద్ద కథే వుంది. నో డౌట్, ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖతో పోల్చితే, ఇకే నగరానికీ రాజధాని అయ్యేందుకు ఇన్ని అర్హతలు వుండవేమో.!

కానీ, చంద్రబాబు హయాంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయ్యింది. రాజధానిగా అమరావతి నోటిఫై అయ్యింది. దాన్ని మార్చాలంటే అంత తేలికైన వ్యవహారం కాదు. కారణం, రైతులతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది.. సీఆర్డీయే రూపంలో. ఆ ఒప్పందాల్ని ఉల్లంఘిస్తే, పరిణామాలు తీవ్రంగా వుంటాయి.

తప్పో ఒప్పె.. అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయ్యింది. దాని మీద ‘కమ్మ’రావతి అనే ముద్ర వేసి, నాటకాలు ఆడుతోంది వైసీపీ. అమరావతి కుంభకోణమన్నారు.. అర్థ రూపాయి అవినీతి కూడా ఇంతవరకు వెలికి తీయలేకపోయారు. అసలు విశాఖ మీద ఎందుకంత ప్రత్యేక శ్రద్ధ వైసీపీకి.? ఇదే మిలియన్ డాలర్ క్వశ్చన్.

ఇంత రచ్చ జరుగుతున్నా, విశాఖ ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజానీకమూ రాజధాని అంశాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. విశాఖ రాజధాని పేరుతో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టేయడం.. బహుశా దేశ చరిత్రలో ఏ అధికార పార్టీ ఇలాంటి పైత్యాన్ని ప్రదర్శించి వుండదు.

ఇంకెన్నాళ్ళీ ‘రాజధాని’ ప్రచార పైత్యం.? ఒక్క రాజధాని కట్టలేని చేతకానితనం.! మూడు రాజధానులంటూ కుట్ర పూరిత రాజకీయం.!

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...