Switch to English

Waltair Veerayya Review: వాల్తేర్ వీరయ్య మూవీ రివ్యూ: పూనకాలు లోడ్ అయ్యాయి

Critic Rating
( 2.75 )
User Rating
( 2.90 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

Waltair Veerayya Review: మెగాస్టార్ చిరంజీవి నుండి వస్తోన్న లేటెస్ట్ మూవీ వాల్తేర్ వీరయ్య. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా?

కథ:

వాల్తేర్ ప్రాంతంలో వీరయ్య ఒక మత్స్య వృత్తిని ఎంచుకుని జీవించే వ్యక్తి. కాల (ప్రకాష్ రాజ్) కారణంగా కూల్ డ్రింక్స్ లో డ్రగ్స్ కలిసి చిన్న పిల్లలు కొంత మంది చనిపోతే ఆ నేరం వీరయ్యతో మరికొంత మందిపై పడుతుంది.

ఈ పరిస్థితి నుండి వీరయ్య ఎలా బయటపడ్డాడు? అలాగే ఆ ప్రాంతంలోకి కమిషనర్ గా వచ్చిన (రవితేజ)కు వీరయ్యకు మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అన్నది చిత్ర కథ.

నటీనటులు:

రీసెంట్ గా కొన్ని సినిమాలు చూసి మెగాస్టార్ చిరంజీవి నటనలో ఏదో మిస్ అవుతోంది అనుకున్న వాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టిస్తాడు చిరు. వింటేజ్ చిరుతో పాటు నేటి అనుభవాన్ని కూడా రంగరించి ఫుల్ ప్యాక్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. చిరంజీవి కామెడీ టైమింగ్ కానీ, ఎమోషనల్ సీన్స్ లో పెర్ఫార్మన్స్ కానీ పీక్స్ లో ఉన్నాయనే చెప్పాలి. తన స్టైలింగ్ కూడా చాలా బాగా కుదిరింది.

రవితేజ ఉన్నంతసేపూ అలరించాడు. ఇక చిరుతో రవితేజకు పడ్డ సన్నివేశాలు అన్నీ కూడా పూనకాలు లోడింగ్ మూమెంట్స్ అనడంలో సందేహం లేదు. శృతి హాసన్ కు మంచి రోలే పడింది. అయితే ఆమె ఎక్కువగా ఫస్ట్ హాఫ్ కే పరిమితమైంది. క్యాథెరిన్ చేయటానికి పెద్దగా ఏం లేదు. ప్రకాష్ రాజ్ బాగా చేయలేదని కాదు కానీ తన నుండి ఇలాంటి పాత్రలు మనం ఎన్నో చూసేసాం. మిగతావారు తమ తమ పరిధుల మేరకు నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు:

బాబీ ఫస్ట్ హాఫ్ ను పూర్తి ఎంటర్టైనింగ్ ఫార్మాట్ లో రాసుకున్నాడు. ఇక సెకండ్ హాఫ్ లెంగ్త్ పరంగా కూడా ఎక్కువగా ఉంది అలాగే ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కాస్త తగ్గడంతో కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అయితే సినిమా ఆద్యంతం కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ను జోడించడంలో బాబీ సక్సెస్ అయ్యాడు. అయితే సెకండ్ హాఫ్ పై ఇంకొంచెం కేర్ పెట్టి ఉంటే బాగుండేది.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బాస్ పార్టీ సాంగ్ ఆర్ట్ వర్క్ ను మెచ్చుకుని తీరాలి. నిర్మాణ విలువల పరంగా మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా తగ్గలేదు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో ఇంకా క్రిస్పీగా ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్:

  • వింటేజ్ చిరు ఎంటర్టైన్మెంట్
  • మూడు పాటలు
  • చిరు, రవితేజ మధ్య ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్ రన్ టైమ్
  • సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే
  • రొటీన్ టెంప్లేట్

చివరిగా:

సరైన మిశ్రమంలో యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కలిసిన వాల్తేర్ వీరయ్య ప్రేక్షకులకు నచ్చే అవకాశాలే ఎక్కువ. ఫస్ట్ హాఫ్ అంతా హాయిగా వెళ్ళిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ రొటీన్ గా మారింది. అలాగే రన్ టైమ్ కూడా ఎక్కువ ఉండటం మైనస్. అయితే ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించే సత్తా వాల్తేర్ వీరయ్యకు ఉంది.

తెలుగుబులెటిన్ రేటింగ్: 2.75/5

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...