Switch to English

చంద్రబాబు తెలివి.! వెన్నుపోటుకి బాలయ్యతోనే కొత్త అర్థం చెప్పించిన వైనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

‘కాళ్ళు పట్టుకుని బతిమాలినా వినలేదు..’ అంటూ ఆనాటి వెన్నుపోటు ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాజాగా ఓ టాక్ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ టాక్ షో నిర్వహిస్తున్నది కూడా స్వర్గీయ ఎన్టీయార్ తనయుడు నందమూరి బాలకృష్ణ కావడం గమనార్హం.
‘అన్‌స్టాపబుల్ రెండో సీజన్’ తొలి గెస్ట్ నారా చంద్రబాబునాయుడు ఎందుకు అయ్యారు.? అన్నది నందమూరి బాలకృష్ణకే తెలియాలి. రాజకీయాల్లో టాలెస్ట్ పర్సనాలిటీ.. అంటూ బావ చంద్రబాబుని నందమూరి బాలకృష్ణ ప్రమోట్ చేసిన వైనం, హైద్రాబాద్‌ని సరికొత్తగా నిర్మించింది చంద్రబాబేనని బాలయ్య చెప్పిన వైనం.. ఇవన్నీ కేవలం తెలుగుదేశం పార్టీకి జాకీలేయడానికే అన్నట్లు తయారైంది పరిస్థితి.

చెరిపేసుకోవాలనుకుంటే చెరిగిపోయే మచ్చ కాదు ‘వెన్నుపోటు’ అంటే. చంద్రబాబు, దానికి ఏ అర్థమైనా చెప్పి వుండొచ్చుగాక, ఎలాగైనా బుకాయిస్తుండొచ్చుగాక.. ఆ వ్యవహారంలో బాధితుడైన ఎన్టీయార్ స్వయానా కంటతడి పెడుతూ, తన అల్లుడు తనకు పొడిచిన వెన్నుపోటు గురించి చెప్పాక.. ఆనాటి ఆ పాపం సమసిపోదు. అయినాగానీ, చంద్రబాబు తాను చెయ్యగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు ఆ ‘వెన్నుపోటు’ మచ్చని చెరిపేసుకునేందుకు. ‘మనమందరం కలిసి ప్రయత్నించాం..’ అంటూ ఆనాటి ఆ వెన్నుపోటు ఘటనపై బాలయ్యతో చంద్రబాబు టాక్ షో ద్వారా చెప్పడం.. బాలయ్యకు చెబుతున్నట్టు కాదు, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నట్లయ్యింది.

స్వర్గీయ ఎన్టీయార్ తనయుడు బాలయ్యే ‘మనం ప్రయత్నించాం..’ అని ఒప్పుకుంటున్నప్పుడు, ఎవరికైనా ఆ వెన్నుపోటు విషయంలో ఇబ్బంది ఏముంటుంది.? అనే చర్చ ఇప్పుడు షురూ అయ్యింది. వావ్ బాలయ్యా.! టాక్ షోని ఇలాక్కూడా వాడొచ్చా.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. స్వర్గీయ ఎన్టీయార్ చివరి రోజుల్లో ఆయన వెంట ఎవరూ లేరు, ఒక్క లక్ష్మీపార్వతి తప్ప. ఆమె ఏ ప్రయోజనాల్ని ఆశించి ఆయనతో ఆ సమయంలో వున్నారు.? అన్నది వేరే చర్చ. కడుపున పుట్టిన పిల్లలెవరూ ఆ పరిస్థితుల్లో ఎన్టీయార్‌ని ఆదుకోలేకపోయారు.! చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదు. ‘మా బ్లడ్డు వేరు.. మా బ్రీడు వేరు..’ అంటుంటారు బాలయ్య. ‘మా వంశం..’ అంటుంటారాయన. ఆ వంశానికి మూల పురుషుడైన ఎన్టీయార్ చివరి రోజుల్లో ఇప్పుడు వంశం గురించి గొప్పలు చెప్పేవాళ్ళెవరూ ఎందుకు లేరు.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...