Switch to English

ఎన్టీయార్, చంద్రబాబు.. ఓ వెన్నుపోటు.! అసలేం జరిగింది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్… విక్రమ్ పూల, అప్పటి ‘వెన్నుపోటు’ వ్యవహారంపై ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ఆనాటి వైస్రాయ్ ఘటన (స్వర్గీయ ఎన్టీయార్ మీద చెప్పులతో దాడి) వ్యవహారానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షిగా తన అనుభవాల్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారాయన.

తెలుగుదేశం పార్టీలో ఆనాటి పరిస్థితుల గురించి విక్రమ్ పూల చేసిన విశ్లేషణ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అసలు స్వర్గీయ ఎన్టీయార్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చాక తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల్ని విశ్లేషించకుండా, పిల్లనిచ్చిన మామని చంద్రబాబు ‘వెన్నుపోటు’ పొడిచారని అనడం కరెక్ట్ కాదన్నది విక్రమ్ పూల విశ్లేషణ.

‘ఎన్టీయార్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చాక చాలా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. లక్ష్మీపార్వతి రాకతో, పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ అవాంఛనీయ పరిణామాలు చాలానే జరిగాయి. టిక్కెట్ల కేటాయింపు దగ్గర్నుంచి, పదవుల పంపకాల వరకూ లక్ష్మీపార్వతి కల్పించుకునేవారు.. అది పార్టీకి చాలా చేటు చేసింది..’ అంటున్నారు విక్రమ్ పూల.

పార్టీకి నష్టం జరుగుతున్న చాలామంది స్వర్గీయ ఎన్టీయార్ మీద గౌరవంతో ఏమీ అనలేకపోయేవారనీ, అలాంటివారంతా చంద్రబాబు దగ్గరే మొరపెట్టుకునేవారనీ, వారందరి ఒత్తిడి నేపథ్యంలోనే పార్టీ పగ్గాలు చంద్రబాబు తీసుకోవాల్సి వచ్చిందని విక్రమ్ పూల అంటున్నారు.

‘వైస్రాయ్ ఘటన వెనుక చంద్రబాబు హస్తం ముమ్మాటికీ లేదు. చంద్రబాబుని బలపర్చిన ఎమ్మెల్యేలంతా లోపల, వైస్రాయ్ హోటల్‌లో వున్నారు. బయట ఎన్టీయార్ సహా ఆయన అనుచరులంతా అనవసర హంగామా చేశారు. బయట నుంచి వచ్చినవాళ్ళలో కొందరు పనిగట్టుకుని ఎన్టీయార్ పక్కనున్న కొందరు నాయకుల ఆవేశపూరిత మాటల నేపథ్యంలో , వారి లక్ష్యంగా చెప్పులు విసరగా.. అది చంద్రబాబు ప్రణాళిక ప్రకారం చేయించినట్టు బయటికి వచ్చిందని, అది చంద్రబాబు కనుసన్నల్లో జరిగింది కాదు.. ’ అని విక్రమ్ పూల చెప్పుకొచ్చారు.

‘నాతోనే పార్టీ పుట్టింది.. నాతోనే పార్టీ అంతమైపోతుంది..’ అని స్వర్గీయ ఎన్టీయార్ చెప్పిన మాటలతోనే, పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా చంద్రబాబుపై ఒత్తిడి పెరిగిందన్నది విక్రమ్ పూల విశ్లేషణ. సెక్రెటేరియట్‌కి ‘భోజనం’ పేరుతో వచ్చి, ప్రభుత్వ వ్యవహారాల్లో లక్ష్మీపార్వతి తలదూర్చి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిన విషయాన్ని పక్కన పెట్టి, చంద్రబాబు మీద బురద చల్లడం అనేది సబబు కాదని విక్రమ్ పూల అంటున్నారు.

అప్పట్లో ఎన్టీయార్, లక్ష్మీపార్వతి.. ఇద్దరూ తప్పు చేశారన్న విక్రమ్ పూల, సంక్షోభ సమయంలో చంద్రబాబు గనుక, పార్టీ బాగు కోసం కఠిన నిర్ణయం తీసుకుని వుండకపోతే, ఈ రోజు తెలుగుదేశం పార్టీనే వుండేది కాదని చెప్పారు విక్రమ్ పూల తన తాజా ఇంటర్వ్యూలో.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...