బిగ్ బాస్ అనేది సూపర్ హిట్ రియాలిటీ షో. ఈ షో ను ఫాలో అయ్యేవారు కోట్లల్లోనే ఉంటారు. ఈ షో నుండి బయటకు వచ్చాక అవకాశాలు ఎలా ఉంటాయి అన్నది పక్కనపెడితే ఈ షో నిర్వహణపై ఎప్పుడూ ప్రేక్షకులకు ఉండే డౌట్స్ ఉంటూనే ఉంటాయి.
బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ను ఎంపిక చేయడం దగ్గరనుండి, వాళ్ళను ఎలిమినేట్ చేసేవరకూ.. ఆ ఓటింగ్ ప్రాసెస్ ఇలా ఏదీ పారదర్శకంగా ఉంటుందని చెప్పలేం. ఇక బిగ్ బాస్ 6 లో మనకు కొత్తగా కనిపిస్తోన్న అంశం నాగార్జున ముందు కూర్చునే ఆడియన్స్. సరిగ్గా ఒక రెండు డజన్ల మందిని ప్రేక్షకుల పేరుతొ నాగార్జున ముందు కూర్చోబెడుతున్నారు.
శనివారం, ఆదివారం నాగార్జున మాట్లాడేటప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుంటున్నారు. పైగా వాళ్ళవే ఫైనల్ కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఆడియన్స్ పెయిడ్ ఆర్టిస్ట్ లన్న వార్త వినిపిస్తోంది. ఆదివారం నాడు శ్రీముఖి హోస్ట్ చేసిన స్టార్ మా పరివార్ లో ఆడియన్స్ లో ఒక మహిళ బిగ్ బాస్ లో గత వారం కనిపించింది. ఆ మహిళే బిగ్ బాస్ లో అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య మధ్య ఏదో నడుస్తోందని కన్ఫర్మ్ చేసేసింది.
దీంతో ఇదంతా బిగ్ బాస్ సెటప్ చేసిన పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్ ఆ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
469670 275620Just a smiling visitor here to share the enjoy (:, btw wonderful pattern . 169778
53424 69745This web internet site is my breathing in, very fantastic layout and perfect content material . 929603