Switch to English

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి మరో క్లీన్ చిట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో చంద్రబాబుని చాలామంది విమర్శిస్తుంటారు. కానీ, వాళ్ళే చంద్రబాబుకి రాజకీయంగా జాకీలేస్తుంటారు.! చంద్రబాబుని రాజకీయంగా ఇరికించే ప్రయత్నం చేసినవాళ్ళే, అనుకోకుండా ఆయన్ని అనేక గండాల నుంచి గట్టెక్కిస్తుంటారు. అసలేంటి కథ.? అదంతా చంద్రబాబు ‘లక్కు’ అనుకోవాలా.? ఇంకోదైనా మాయా విద్య చంద్రబాబు వద్ద వుందా.? చాలామందికి ఇలాంటి డౌట్లు వస్తుంటాయ్.

అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళారు. దేశంలో చాలామంది రాజకీయ నాయకుల మీద అక్రమాస్తుల కేసులు నమోదవుతుంటాయ్. కొందరు తప్పించుకుంటారు, కొందరు ఇరుక్కుపోతారు. చంద్రబాబు పరిస్థితే కాస్త భిన్నం.

వైసీపీ నేత లక్ష్మిపార్వతి చాలాకాలం క్రితమే.. అంటే, వైసీపీలో చేరకముందే చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు చేశారు.. ఇప్పటికీ చేస్తూనే వున్నారు. తన భర్త స్వర్గీయ ఎన్టీయార్‌ని చంద్రబాబే రాజకీయంగా వెన్నుపోటు పొడిచారన్నది లక్ష్మిపార్వతి ఆరోపణ. అసలంటూ స్వర్గీయ ఎన్టీయార్ మరణానికీ, రాజకీయ పతనానికీ కారణం లక్ష్మీపార్వతి అని టీడీపీ ఆరోపించడం కొత్తేమీ కాదు.

ఎవరి గోల వారిది.. కానీ, అల్లుడు చంద్రబాబు మీద లక్ష్మిపార్వతికి విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతోనే, ఆ చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇప్పించేందుకున్నట్లు లక్ష్మిపార్వతి కోర్టును ఆశ్రయించారేమో.! లేకపోతే, ‘ఆయన ఆస్తుల వివరాలు కోరడానికి మీరెవరు.?’ అంటూ చీవాట్లు పెట్టి మరీ, సర్వోన్నత న్యాయస్థానం, లక్ష్మీపార్వతి దాఖలు చేసిన అక్రమాస్తుల కేసుని కొట్టివేయడమేంటి.?

రాజకీయాల్లో చంద్రబాబు తలపండిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు మీద ఆరోపణలు వస్తాయ్.. కానీ, ఏదీ నిలబడదు. అదే, ఆయన ప్రత్యేకత. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చంద్రబాబుకి బాగా తెలుసంటారు. అందులో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఎలాంటి వివాదం నుంచి అయినా, ఆయన తేలిగ్గానే తప్పించుకోగలుగుతారు.

బహుశా సరైన ‘బ్యాక్‌గ్రౌండ్ వర్క్’ చేయకుండానే, చంద్రబాబు మీద కేసులు వేసేసి, అభాసుపాలవుతుంటారు రాజకీయ ప్రత్యర్థులు. అవన్నీ చంద్రబాబుకి రాజకీయంగా కలిసొచ్చేస్తుంటాయ్.

అక్రమాస్తుల కేసులో చంద్రబాబుకి క్లీన్ చిట్.. ఇదీ తాజా వార్త.! దీనికి కారణం ఎవరు.? లక్ష్మీ పార్వతి. ఆమె ఏ పార్టీలో వున్నారు.? వైసీపీలో.! సో, 60-40 ఒప్పందాల్లో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుకి వైసీపీ ఈసారి ఇలా ఊరట ఇచ్చిందని అనుకోవాలేమో.!

3 COMMENTS

  1. 678507 463151Hoping to go into business venture world-wide-web Indicates revealing your products or services furthermore companies not only to ladies locally, but nevertheless , to many prospective clients in which are online in most cases. e-wallet 90210

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...