Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: యువతకు స్ఫూర్తి నింపిన చిరంజీవి ‘ఛాలెంజ్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

చిరంజీవి.. ఈ పేరును తెలుగు చిత్ర పరిశ్రమ ఓన్ చేసుకున్న రోజులవి. 1980 దశకంలో చిరంజీవి నామస్మరణే జరిగిందంటే అతిశయోక్తి లేదు. చిన్న చిన్న పాత్రలు, అతిధి పాత్రలు, విలన్ పాత్రల నుంచి హీరో పాత్రల వరకూ చిరంజీవి చేయనిది లేదు. ఈక్రమంలో యాక్షన్, ఫ్యామిలీ, సెంటిమెంట్ పాత్రలు సైతం చేశారు. ఈ ఒరవడిలో ఖైదీ తర్వాత చిరంజీవి తన ప్రతి సినిమాలో ఏ ప్రత్యేకత చూపిస్తారనే ఆసక్తితోనే చూశారు ప్రేక్షకులు. ఈక్రమంలో ఆయన ఓ నవలను సినిమాగా చేశారు. అదే.. యండమూరి వీరేంద్రనాధ్ రాసిన ‘డబ్బు టు ది పవరాఫ్ డబ్బు’. ఈ నవలను ‘ఛాలెంజ్’ టైటిల్ తో సినిమా చేశారు. నిజజీవితంలో చిరంజీవి కష్టపడి ఎంతటి స్థాయికి ఎదిగారో ఈ సినిమాలో అటువంటి పాత్రే చేసి ఎందరికో స్ఫూర్తి నింపారు.

జీరో టు హీరో..

రానా చెప్పినట్టు.. ‘ఒక్కడిగా వచ్చి ఒక్కొక్కటిగా సాధిస్తూ దశాబ్దాలుగా ఒకటో స్థానంలో నిలబడ్డ ఇలవేల్పు మెగాస్టార్ చిరంజీవి’ అనే మాట నిజమని ఆయన కెరీర్ చూస్తే అర్ధమవుతుంది. సినిమాలో చిరంజీవి ఒక నిరుద్యోగి నుంచి స్కూటర్ కంపెనీ చైర్మన్ స్థాయికి ఎదుగుతారు. ప్రేక్షకులు కథలో ఎంత లీనమవుతారో.. చిరంజీవిని గాంధీ పాత్రలో కూడా అంతే ఓన్ చేసుకున్నారు. ఇంటర్యూకి చిరంజీవి కాలినడకన రావడం.. రావుగోపాలరావు అవమానించడం.. ఈక్రమంలో 5ఏళ్లలో 50లక్షలు సంపాదిస్తానని చిరంజీవి ఛాలెంజ్ చేయడం ప్రేక్షకుల్ని కథలో లీనం చేస్తుంది. చిరంజీవి ఎలాంటి అడుగులు వేయబోతున్నారనే ఆసక్తి.. అనుకున్న లక్ష్యానికి చిరంజీవి చేరుకునే క్రమం ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక పాటలలో స్టెప్స్, ఫైట్స్ కొత్త పుంతలు తొక్కించాడు చిరంజీవి. ‘ఇందువదన’ పాట చూస్తే.. ఇప్పటికీ మది పులకించని తెలుగు ప్రేక్షుకుడు ఉండడు. విజయశాంతి, సుహాసిని ల కాంబినేషన్, ఇళయరాజా సంగీతం తో.. సినిమా ఇప్పటికీ ఓ కన్నుల పండుగ గా అనిపిస్తుంది..

చిరంజీవి బర్త్ డే స్పెషల్స్: యువతకు స్ఫూర్తి నింపిన చిరంజీవి ‘ఛాలెంజ్’

గాంధీ పాత్రలో జీవించిన చిరంజీవి

నిజజీవితంలో చిరంజీవి సినీ ప్రయాణానికి.. సినిమాలో గాంధీ పాత్రకు చాలా దగ్గర పోలిక ఉంటుంది. ఖైదీ తర్వాత చిరంజీవి కెరీర్ లా సినిమాలో చిరంజీవి చాలెంజ్ కి ముందు  తర్వాతలా కథ నడుస్తుంది. ప్రతి ఫ్రేములో హీరో, విలన్ మధ్య ఎత్తుకు పైఎత్తులు, ఆధిపత్య పోరు ఆకట్టుకుంటుంది. అంతర్లీనంగా నేటి యువత అనుకున్నది సాధించాలంటే ఒక లక్ష్యం, పట్టుదల ఉండాలని గాంధీ పాత్ర ద్వారా చిరంజీవి చెప్తారు. చదువుకుని నిరుద్యోగులుగా ఉండటం కంటే.. తమ తెలివిని, సామర్ధ్యాన్ని పెట్టుబడిగా పెట్టాలనే ఆలోచనని సినిమాలో చిరంజీవి కలిగిస్తారు. దీంతో ఈ సినిమాలో చిరంజీవి యువతకు ప్రతినిధిగా ఉండే పాత్రలో రాణించారు. క్లైమాక్స్ లో.. ‘రామ్మోహనరావు.. నేను గెలిచాను’ అని చిరంజీవి విజయ గర్వంతో చెప్పే మాటలో గాంధీ పాత్రే కనిపిస్తుందంటే చిరంజీవి ఆ పాత్రలో ఎంతగా జీవించారో అర్ధమవుతుంది.

సూపర్ హిట్ కాంబినేషన్

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై నిర్మాత కెఎస్. రామారావు ఈ సినిమా నిర్మించారు. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. నవలను సినిమా రచనగా మలచి ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కించారు. 1984 ఆగష్టు 9న విడుదలైన ఛాలెంజ్ ప్రేక్షకులను మెప్పించింది. సినిమా సూపర్ హిట్ గా నిలిచి చిరంజీవి – కోదండరామిరెడ్డి కాంబినేషన్ కు తిరుగులేదని మరోసారి నిరూపించింది. నిర్మాత కెఎస్ రామారావు కూడా చిరంజీవితో సాన్నిహిత్యం ఏర్పడి తర్వాత రోజుల్లో మరిన్ని సూపర్ హిట్స్ ఇచ్చేలా నాంది పలికింది ఛాలెంజ్.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....