ఎఫ్3లో..
‘ఎఫ్2’కి మించి ట్రిపుల్ డోస్ వినోదం ‘ఎఫ్3’లో వుంటుంది. ప్రేక్షకుల అంచనాలు ఏమాత్రం మిస్ కావు’ అని విక్టరీ వెంకటేష్ అన్నారు. మే27న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కాబోతోంది. తున్న ఎఫ్3 సినిమా ప్రమోషన్లో ఆయన మాట్లాడారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి వెంకటేశ్ ఈ మల్టీస్టారర్ సినిమాలో నటించారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ‘F2’ ఫ్రాంచైజీలో భాగంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సందర్భంగా వెంకటేశ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
కామెడీ నాకు ఎనర్జీ..
కామెడీ అంటే నాకు ఎనర్జీ వచ్చేస్తుంది. కాలేజీ రోజుల్లో సరదాగా ఉండేవాడిని. కామెడీ చేస్తున్నప్పుడు ఇమేజీ ఆలోచించను కాబట్టే నాలోని నేచురల్ ఫ్లో స్పాంటేనియస్ గా బయటకు వస్తుంది. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, అబ్బాయిగారు, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి.. తదితర సినిమాల్లో కామెడీ అలా వచ్చిందే. అనిల్ రావిపూడి ఇదే కోరుకుంటాడు. నాకు ఇలా కావాలి.. అని అడగడు. నేను చేసేదే చేయమంటాడు. నారప్ప, దృశ్యం రెండూ సీరియస్ సినిమాలు. కరోనా, లాక్ డౌన్ సమయాలకు తగ్గట్టుగానే ఓటీటీల్లోనే విడుదలయ్యాయి. నారప్ప ధియేటర్లో విడుదలైతే బాగుండేది. ఆ విషయంపై ఇప్పటికీ ఆలోచిస్తూంటా. ధియేటర్లోనే సినిమా బాగుంటుంది. సినిమా ఫీల్ అక్కడే వస్తుంది. ‘ఎఫ్3’ తో మళ్ళీ థియేటర్ ఆడియన్స్ ని కలుసుకోవడం ఆనందంగా వుంది.
స్టార్ డమ్ పక్కన పెట్టేస్తా..
సినిమా చేసేటప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా.. నా పాత్రని మాత్రమే ఎంజాయ్ చేస్తాను. ఏదైనా ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే చేస్తాను.. డబుల్ డోస్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ముందుగా ఏదీ ప్లాన్ చేసుకోను. నా ప్రతీ సినిమానీ మొదటి సినిమాగానే భావించి కష్టపడతా. సినిమా ఓకే అయ్యాక నా స్టార్ డమ్ పక్కన పెట్టేస్తా. ఎఫ్3’ డబ్బు చుట్టూ తిరిగే కథ. త్వరగా డబ్బులు సంపాదించడం.. పెద్ద కలలు కనడం.. అవకాశాలు సృష్టించడం.. మానవునిలోని సహజ లక్షణం. అందరిలో ఆశ వుంటుంది కానీ.. అత్యాశకు పోకూడదు. ఉన్నదాంట్లో తృప్తి చెందాలి. అత్యాశలో బోలెడు సమస్యలు వస్తాయి. అనేక పాఠాలు నేర్చుకుంటాం. అప్పుడే మారుతాం. మారకపోతే .. మళ్ళీ అవే సమస్యలు ఎదురవుతాయి. ఇదే ఎఫ్3 కథ. ఇందులోనే వినోదం చూపించాం. చాలామంది నటులు యాడ్ అయ్యారు.
అల్లు రామలింగయ్య గారు, జానీ లీవర్ కామెడీ..
మసాలా సినిమా నుండే అనిల్ నాకు తెలుసు. చాలా సింపుల్ పర్శన్. అద్భుతంగా రాస్తారు. నేచురల్ గా ఉంటాయి. మంచి కామెడీ టైమింగ్ వుంది. ఆయనకేం కావాలో క్లారిటీ ఉంది. నటీనటుల నుండి దిబెస్ట్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. దీంతో అందరి నటన సహజంగా అనిపిస్తుంది. అనిల్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు.. మేమిద్దరం క్రేజీగా వుంటాం. ఎఫ్3’లో నా పాత్ర రియల్ లైఫ్ కి పూర్తి ఆపోజిట్ గా వుంటుంది. నాకు చిన్నప్పటి నుండి అబ్జర్వేషన్ చేయడం అలవాటు. ప్రయాణాలు చేసేటప్పుడు, నలుగురితో కలిసినప్పుడు.. వారి ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంజ్వేజ్ ని అబ్జర్వ్ చేస్తాను. మనకున్న కమెడియన్ల నుంచి ఏదొక విషయాన్ని నేర్చుకుంటా. ప్రతి డైలాగ్ ని ఇంప్రవైజ్ చేయాల్సిందే. కొన్నిసార్లు వాయిస్ లోనే ఫన్ పుడుతుంది. అల్లు రామలింగయ్య గారు, జానీ లీవర్ టిపికల్ వాయిస్ తోనే నవ్విస్తారు.
మల్టీస్టారర్స్ చేస్తా.. కానీ..
ఎఫ్2 లో వరుణ్ తేజ్ తో నా కాంబినేషన్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు. ‘ఎఫ్3’ లో వరుణ్ పాత్ర ఇంకా బావుంటుంది. చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్ తో వండర్ ఫుల్ జర్నీ. దిల్ రాజు గారు నాకు ‘ప్రేమించుకుందాం రా’ సమయంలోనే తెలుసు. సినిమాల పట్ల చాలా ప్యాషన్ వుంది. హార్డ్ వర్కర్. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలి. కథ బావుంటే ఎవరితోనైనా మల్టీ స్టారర్ చేస్తా. బాక్సాఫీస్ లెక్కల కంటే ప్రతి సినిమా సక్సెస్ కావాలని.. నిర్మాతకు మేలు జరగాలని భావిస్తా. ఫలితం ప్రేక్షకుల చేతిలోనే వుంటుంది. పాన్ ఇండియా గురించి పెద్దగా అలోచించలేదు. సరైన టీం కుదిరితే తప్పకుండా చేస్తా. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తున్నా. రియాల్టీ షోస్ కి హోస్ట్ గా చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. మా అబ్బాయి ఎంట్రీ గురించి ప్రస్తుతానికి ఆలోచనేదీ లేదు. ఇంకా చదువుకుంటున్నాడు.
రియల్ లైఫ్ లో ఫస్ట్రేషన్..
కోవిడ్ టైం లో షూటింగ్ చాలా కష్టం అనిపించింది. షాట్ అయ్యాక బస్ లో సానిటైజ్ చేసుకోవడం.. ఇంటికెళ్లాక ఆవిరి పట్టడం చేశా. సాధారణంగా ఇంటి నుంచి బయటకు రాను. ఫ్యామిలీతో గడపటానికి ప్రాధాన్యత ఇస్తా. మెడిటేషన్, ధ్యానం చేస్తుంటా. నాన్నగారి బయోపిక్ చేస్తే బానే వుంటుంది. స్క్రిప్ట్ కుదరాలి. వివేకానంద కథ అనుకున్నా.. కుదరలేదు. రియల్ లైఫ్ లో ఫస్ట్రేషన్ వుండదు. నేను టైమ్ బాగా ఫాలో అవుతాను. టైమ్ విషయంలో ఇబ్బంది పెడితే కొంచెం చిరాకు వస్తుంది. ఇండస్ట్రీలో నేను నేను ఒకరితో పోల్చుకొను. నాకు ఉన్నదే బోనస్ అనుకుంటా. ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తా. అందరికీ ఇది అవసరం. ప్రస్తుతం సితార, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ లో సినిమాలతోపాటు ఓ వెబ్ సిరీస్ చేస్తున్నా.
406573 490903hey I was really impressed with the setup you used with this blog. I use blogs my self so good job. definatly adding to bookmarks. 966290
573708 710541Excellent post man, keep the nice work, just shared this with the friendz 576635
983401 412982Thanks for the excellent post against your weblog, it genuinely provides me with a look about this topic.??;~.?? 879009