Switch to English

ఎఫ్3లో.. ఎఫ్2కి మించి ట్రిపుల్ డోస్ వినోదం గ్యారంటీ: విక్టరీ వెంకటేశ్

ఎఫ్3లో..

‘ఎఫ్2’కి మించి ట్రిపుల్ డోస్ వినోదం ‘ఎఫ్3’లో వుంటుంది. ప్రేక్షకుల అంచనాలు ఏమాత్రం మిస్ కావు’ అని విక్టరీ వెంకటేష్ అన్నారు. మే27న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కాబోతోంది. తున్న ఎఫ్3 సినిమా ప్రమోషన్లో ఆయన మాట్లాడారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి వెంకటేశ్ ఈ మల్టీస్టారర్ సినిమాలో నటించారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ‘F2’ ఫ్రాంచైజీలో భాగంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సందర్భంగా వెంకటేశ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.

కామెడీ నాకు ఎనర్జీ..

కామెడీ అంటే నాకు ఎనర్జీ వచ్చేస్తుంది. కాలేజీ రోజుల్లో సరదాగా ఉండేవాడిని. కామెడీ చేస్తున్నప్పుడు ఇమేజీ ఆలోచించను కాబట్టే నాలోని నేచురల్ ఫ్లో స్పాంటేనియస్ గా బయటకు వస్తుంది. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, అబ్బాయిగారు, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి.. తదితర సినిమాల్లో కామెడీ అలా వచ్చిందే. అనిల్ రావిపూడి ఇదే కోరుకుంటాడు. నాకు ఇలా కావాలి.. అని అడగడు. నేను చేసేదే చేయమంటాడు. నారప్ప, దృశ్యం రెండూ సీరియస్ సినిమాలు. కరోనా, లాక్ డౌన్ సమయాలకు తగ్గట్టుగానే ఓటీటీల్లోనే విడుదలయ్యాయి. నారప్ప ధియేటర్లో విడుదలైతే బాగుండేది. ఆ విషయంపై ఇప్పటికీ ఆలోచిస్తూంటా. ధియేటర్లోనే సినిమా బాగుంటుంది. సినిమా ఫీల్ అక్కడే వస్తుంది. ‘ఎఫ్3’ తో మళ్ళీ థియేటర్ ఆడియన్స్ ని కలుసుకోవడం ఆనందంగా వుంది.

స్టార్ డమ్ పక్కన పెట్టేస్తా..

సినిమా చేసేటప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా.. నా పాత్రని మాత్రమే ఎంజాయ్ చేస్తాను. ఏదైనా ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే చేస్తాను.. డబుల్ డోస్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ముందుగా ఏదీ ప్లాన్ చేసుకోను. నా ప్రతీ సినిమానీ మొదటి సినిమాగానే భావించి కష్టపడతా. సినిమా ఓకే అయ్యాక నా స్టార్ డమ్ పక్కన పెట్టేస్తా. ఎఫ్3’ డబ్బు చుట్టూ తిరిగే కథ. త్వరగా డబ్బులు సంపాదించడం.. పెద్ద కలలు కనడం.. అవకాశాలు సృష్టించడం.. మానవునిలోని సహజ లక్షణం. అందరిలో ఆశ వుంటుంది  కానీ.. అత్యాశకు పోకూడదు. ఉన్నదాంట్లో తృప్తి చెందాలి. అత్యాశలో బోలెడు సమస్యలు వస్తాయి. అనేక పాఠాలు నేర్చుకుంటాం. అప్పుడే మారుతాం. మారకపోతే .. మళ్ళీ అవే సమస్యలు ఎదురవుతాయి. ఇదే ఎఫ్3 కథ. ఇందులోనే వినోదం చూపించాం. చాలామంది నటులు యాడ్ అయ్యారు.

ఎఫ్3లో.. ఎఫ్2కి మించి ట్రిపుల్ డోస్ వినోదం గ్యారంటీ: విక్టరీ వెంకటేశ్

అల్లు రామలింగయ్య గారు, జానీ లీవర్ కామెడీ..

మసాలా సినిమా నుండే అనిల్ నాకు తెలుసు. చాలా సింపుల్ పర్శన్. అద్భుతంగా రాస్తారు. నేచురల్ గా ఉంటాయి. మంచి కామెడీ టైమింగ్ వుంది. ఆయనకేం కావాలో క్లారిటీ ఉంది. నటీనటుల నుండి దిబెస్ట్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. దీంతో అందరి నటన సహజంగా అనిపిస్తుంది. అనిల్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు.. మేమిద్దరం క్రేజీగా వుంటాం. ఎఫ్3’లో నా పాత్ర రియల్ లైఫ్ కి పూర్తి ఆపోజిట్ గా వుంటుంది. నాకు చిన్నప్పటి నుండి అబ్జర్వేషన్ చేయడం అలవాటు. ప్రయాణాలు చేసేటప్పుడు, నలుగురితో కలిసినప్పుడు.. వారి ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంజ్వేజ్ ని అబ్జర్వ్ చేస్తాను. మనకున్న కమెడియన్ల నుంచి ఏదొక విషయాన్ని నేర్చుకుంటా. ప్రతి డైలాగ్ ని ఇంప్రవైజ్ చేయాల్సిందే. కొన్నిసార్లు వాయిస్ లోనే ఫన్ పుడుతుంది. అల్లు రామలింగయ్య గారు, జానీ లీవర్ టిపికల్ వాయిస్ తోనే నవ్విస్తారు.

మల్టీస్టారర్స్ చేస్తా.. కానీ..

ఎఫ్2 లో వరుణ్ తేజ్ తో నా కాంబినేషన్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు. ‘ఎఫ్3’ లో వరుణ్ పాత్ర ఇంకా బావుంటుంది. చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్ తో వండర్ ఫుల్ జర్నీ. దిల్ రాజు గారు నాకు ‘ప్రేమించుకుందాం రా’ సమయంలోనే తెలుసు. సినిమాల పట్ల చాలా ప్యాషన్ వుంది. హార్డ్ వర్కర్. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలి. కథ బావుంటే ఎవరితోనైనా మల్టీ స్టారర్ చేస్తా. బాక్సాఫీస్ లెక్కల కంటే ప్రతి సినిమా సక్సెస్ కావాలని.. నిర్మాతకు మేలు జరగాలని భావిస్తా. ఫలితం ప్రేక్షకుల చేతిలోనే వుంటుంది. పాన్ ఇండియా గురించి పెద్దగా అలోచించలేదు. సరైన టీం కుదిరితే తప్పకుండా చేస్తా. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తున్నా. రియాల్టీ షోస్ కి హోస్ట్ గా చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. మా అబ్బాయి ఎంట్రీ గురించి ప్రస్తుతానికి ఆలోచనేదీ లేదు. ఇంకా చదువుకుంటున్నాడు.

రియల్ లైఫ్ లో ఫస్ట్రేషన్..

కోవిడ్ టైం లో షూటింగ్ చాలా కష్టం అనిపించింది. షాట్ అయ్యాక బస్ లో సానిటైజ్  చేసుకోవడం.. ఇంటికెళ్లాక ఆవిరి పట్టడం చేశా. సాధారణంగా ఇంటి నుంచి బయటకు రాను. ఫ్యామిలీతో గడపటానికి ప్రాధాన్యత ఇస్తా. మెడిటేషన్, ధ్యానం చేస్తుంటా. నాన్నగారి బయోపిక్ చేస్తే బానే వుంటుంది. స్క్రిప్ట్ కుదరాలి. వివేకానంద కథ అనుకున్నా.. కుదరలేదు. రియల్ లైఫ్ లో ఫస్ట్రేషన్ వుండదు. నేను టైమ్ బాగా ఫాలో అవుతాను. టైమ్ విషయంలో ఇబ్బంది పెడితే కొంచెం చిరాకు వస్తుంది. ఇండస్ట్రీలో నేను నేను ఒకరితో పోల్చుకొను. నాకు ఉన్నదే బోనస్ అనుకుంటా. ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తా. అందరికీ ఇది అవసరం. ప్రస్తుతం సితార, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ లో సినిమాలతోపాటు ఓ వెబ్ సిరీస్ చేస్తున్నా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘హ్యాపీ బర్త్ డే’లో పాత్రలన్నీ హీరోలే.. సర్రియల్ కామెడీ సినిమా: లావణ్య...

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "హ్యాపీ బర్త్ డే". రవిశంకర్ యలమంచిలి సమర్పణలో క్లాప్...

‘ది వారియర్’ ప్రేక్షకులకు నచ్చుతుంది.. కథ విని ఎగ్జైట్ అయ్యా: కృతి...

యువ హీరో రామ్ పోతినేని ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో కృతి...

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి విడుదల చేసిన “రామన్న యూత్” ఫస్ట్ లుక్

"జార్జ్ రెడ్డి" చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అభయ్ బేతిగంటి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘రామన్న యూత్’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను...

సినీ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత.. పవన్ కల్యాణ్ సంతాపం

ప్రముఖ సినీ పాత్రికేయుడు, సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఇటివల వయసు సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన...

బింబిసార ట్రైలర్‌.. మ్యాటర్ ఉన్న సినిమా

తెలుగు సినిమాల స్థాయి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. గ్రాఫిక్స్ తో తెలుగు సినిమాల స్థాయి అమాంతం పెంచేస్తున్నారు. గ్రాఫిక్స్‌ వర్క్‌ తో బాహుబలి ని...

రాజకీయం

నరేంద్ర మోడీ, కేసీయార్, వైఎస్ జగన్.! ఎవరెలా.? ఎవరికేంటి.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలకు వచ్చి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద్రాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు...

‘రైలు తగులబెట్టి నన్ను చంపాలని చూశారు..’ ఎంపీ రఘురామ ఆరోపణ

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రైలులో భీమవరం వెళ్తున్న తనను ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో చంపేందుకు కుట్ర పన్నారని.. ఇందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు...

జగనన్న విద్యా కానుక: పేదరికం పోవాలంటే చదువే మార్గం: సీఎం జగన్

పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలని.. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని సీఎం జగన్ అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో విద్యార్ధులకు కిట్లను పంపిణీ...

మురుగు కాల్వలో దిగి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. నియోజకవర్గ పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలోని మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ మురుగు కాల్వలో...

మెగాస్టార్ చిరంజీవిపై బులుగు పచ్చ అసహనం.!

మెగాస్టార్ చిరంజీవి చేసిన నేరమేంటి.? వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా.. అదేనండీ, బులుగు మీడియా.. అలాగే పచ్చ మీడియా.. ఎందుకు చిరంజీవి మీద విషం చిమ్ముతున్నట్టు.? ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న...

ఎక్కువ చదివినవి

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: ఈ ర్యాంకుల గోలేంటి.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విభాగంలో మొదటి ర్యాంక్ వచ్చింది. నిజానికి, ఇది ఆహ్వానించదగ్గ విషయమే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ర్యాంకుల్ని ప్రకటించారు గనుక, ర్యాంకుల్లో...

వడ్డించేవాడు మనవాడైతే.! వైసీపీ వాలంటీర్ల సాక్షిగా ఐదు కోట్ల దోపిడీ.!

‘వాలంటీర్ పోస్టులు ఎవరికి ఇచ్చుకున్నాం.? వైసీపీ కార్యకర్తలకే కదా.? వాళ్ళెవరైనా పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే, పీకి పారెయ్యండి..’ ఇది తాజాగా ఓ మంత్రిగారు సెలవిచ్చిన వైనం. కొన్నాళ్ళ క్రితం, ‘వాలంటీర్ పోస్టులన్నీ మన...

పవన్‌ బహుభార్యత్వంపై పోతుల సునీత తీవ్ర విమర్శలు

పవన్ కళ్యాణ్‌ సినిమా ల్లో ఎంత పెద్ద స్టార్‌ అయినా.. రాజకీయాల్లో ఎంతో నిజాయితీగా ఉంటాడు అనే పేరును దక్కించుకున్నా కూడా ఆయన యొక్క బహు భార్యత్వం తాలూకు మైనస్‌ ఎప్పటికప్పుడు ఆయన...

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..! ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచన

హైదరాబాద్ నగరం ప్రస్తుతం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారిపోయింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు కావడంతో దేశం నలుమూలల నుంచీ బీజేపీ శ్రేణులు నగరానికి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో...

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..! ఆన్ లైన్ లో టికెట్ల విక్రయంపై స్టే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్లు విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు పూర్తైన...