Switch to English

వైసీపీపై జనసేన మార్కు కౌంటర్ ఎటాక్.! బరాబర్ ఏకి పారేస్తాం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

తగ్గేదే లేదంటోంది జనసేన.! ఔను, వైసీపీ విమర్శల నేపథ్యంలో జనసేన పార్టీ చూస్తూ కూర్చోదనే విషయాన్ని కుండబద్దలు గొట్టేస్తున్నారు జనసైనికులు. ‘మేమెవరికో దత్తపుత్రుడని మీరు అంటున్నారు. అలాంటి విమర్శలు ఆకపోతే, మేం మిమ్మల్ని సీబీఐ దత్త పుత్రుడు అనాల్సి వస్తుంది.. చర్లపల్లి జైలు షటిల్ టీమ్ అనాల్సి వస్తుంది..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కౌంటర్ ఎటాక్ ఇచ్చాక, జనసైనికులకు కూడా ఈ విషయమై స్పష్టమైన సంకేతాలు అందాయి.

ఇంకేముంది.? యుద్ధం మొదలైంది.! ‘బరాబర్ ఏకి పారేస్తాం.. ఇందులో ఇంకో మాటకు తావే లేదు..’ అంటున్నారు జనసైనికులు. ‘ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఓ టూరిస్టు మాత్రమే’ అని తాజా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ట్వీటేస్తే, ‘ఒక టూరిస్టు రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తోంటే.. రాష్ట్రాన్ని పాలించినవాళ్ళు ఏం చేస్తున్నట్టు.?’ అంటూ కౌంటర్ ఎటాక్ జనసేన నుంచి షురూ అయ్యింది.

‘పవన్ మాట్లాడే ప్రతి మాటా టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్’ అని వైసీపీ నాయకుడొకరు విమర్శిస్తే, ‘జగన్ మాట్లాడే ప్రతి మాటా సీబీఐ దత్త పుత్రుడికి సీబీఐ రాసిచ్చిన స్క్రిప్ట్’ అంటోంది జనసేన. అంతేనా, చంచల్‌గూడానో, చర్లపల్లినో.. ఆయా జైళ్ళలోని నేరస్తుల నుంచి వైసీపీ అధినేత స్ఫూర్తి పొందినట్టున్నారనే విమర్శలూ జనసైనికుల నుంచి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

అంతే మరి, తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నట్టే వుంటుంది వ్యవహారం. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతల వ్యక్తగత జీవితాల్నీ జనసైనికులు బజార్న పడేస్తున్నారు. అరగంట అంబోతు గురించి, గంట పూబంతి గురించీ… కొబ్బరి చిప్పల వెల్లుల్లిపాయ్ గురించీ.. జనసైనికులు వేస్తున్న సెటైర్లతో వైసీపీకి మైండ్ బ్లాంక్ అయిపోతోంది.

‘మేం మీ పాలనా వైఫల్యాలపై స్పందిస్తాం.. అది మా బాధ్యత.. మా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడొద్దు..’ అని సున్నితంగా జనసేనాని వ్యాఖ్యానిస్తే, వైసీపీకి జనసేనాని అలుసైపోయారు. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. ‘నువ్వెంత.. అంటే నువ్వెంత..’ అనే స్థాయికి వ్యవహారం వెళ్ళింది. ఏకిపారేయడం జనసేన మొదలెడితే, వైసీపీ పరిస్థితి ఎలా వుంటుందో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...