గోపీచంద్, తాప్సీ హీరో హీరోయిన్లుగా 2013లో వచ్చిన సినిమా సాహసం. ఈ సినిమాలో పాకిస్థాన్ భూభాగంలో ఉన్న హింగ్లజ్ మాతా మందిర్ అనే హిందూ దేవాలయంను చూపిస్తారు. అయితే.. ఇప్పటివరకూ పాకిస్థాన్ లో వెలుగులోకి రాని హిందూ ఆలయం బయల్పడింది. భారత్ అంటే మండిపడే పాకిస్థాన్ లో హిందూ దేవాలయం వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. వాయువ్య పాకిస్థాన్ ప్రాంతంలోని స్వాత్ జిల్లాలో ఈ పురాతన ఆలయం బయల్పడింది.
జిల్లాలోని బారీకోట్ ఘుండాయ్ ప్రాంతంలో ఒక పర్వతం వద్ద విష్ణు దేవాలయం బయల్పడింది. పాకిస్థాన్, ఇటాలియన్ పురావస్తు నిపుణులు జరుపుతున్న తవ్వకాల్లో ఈ ఆలయం వెలుగుచూసింది. ఇది దాదాపు 1300 ఏళ్ల క్రితం నాటి హిందూ ఆలయమని అధికారులు అంటున్నారు. ఈ ఆలయాన్ని షాహీలు నిర్మించారని ఖైబర్ పఖ్తున్ఖ్వా పురావస్తు శాఖకు చెందిన ఫజల్ ఖలీక్ అంటున్నారు. ఈ ఆలయం వద్ద పలు విశేషాలున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
ఆలయం సమీపంలో ఒక కొలను, వాచ్ టవర్, కంటోన్మెంట్ ఆనవాళ్లు కనుగొన్నామని ఫజల్ చెప్పారు. క్రీ.శ.850-1026 ప్రాంతంలో కాబుల్ లోయను పరిపాలించిన హిందూ రాజవంశం.. హిందూ షాహీలు లేదా కాబుల్ షాహీలు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. వారి కాలంలో ఈ ప్రాంతాన్ని తూర్పు అఫ్ఘనిస్థాన్, గాంధార (పాకిస్థాన్)గా పిలిచేవారు. పాలనా కాలంలో వాయువ్య భారతదేశాన్ని కాబుల్ లోయగా వారి పిలిచేవారని కూడా ఆయన చెప్పుకొచ్చేవారు. ప్రస్తుతం ఈ ఆలయం ప్రాధాన్యం సంతరించుకుంది.
793367 21204baby strollers with high traction rollers really should be significantly safer to use compared to those with plastic wheels- 923031
971795 797830Attractive section of content. I just stumbled upon your weblog and in accession capital to assert that I acquire truly enjoyed account your weblog posts. Anyway I will likely be subscribing to your augment and even I achievement you access consistently swiftly. 344484
603815 791112Id should speak to you here. Which is not some thing Which i do! I like reading an article that can make individuals believe. Also, thank you for permitting me to comment! 596679