ఇటివల కాస్త ప్రభావం తగ్గిన కరోనా మళ్లీ అమెరికా, యూరప్ దేశాల్లో విజృంభించడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు తోడు వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. పలు కంపెనీలు మూడో దశ ప్రయోగాల దశకు చేరుకున్నాయి కూడా. ఈ కోవలోకే చైనాకు చెందిన అన్హుయి జిఫీ లాంగ్ కామ్ బయో ఫార్మా కూడా వ్యాక్సిన్ పై ప్రయోగాలు చేస్తోంది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కూడా మూడో దశకు వచ్చినట్టు పేర్కొనడం విశేషం. చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ తో కలిసి అన్హుయి ఈ వ్యాక్సిన్ సిద్ధం చేస్తోంది.
జూన్ 19న అనుమతులు వచ్చిన తర్వాత తొలిదశ, రెండో దశల్లో సక్సెస్ అయిన ఈ వ్యాక్సిన్ ఇప్పుడు మూడో దశకు చేరుకుంది. బీజింగ్ సహా పలు నగరాలకు చెందిన 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారి మధ్య ప్రయోగించి సక్సెస్ అయింది. ప్రస్తుతం జరిగే మూడో దశ ప్రయోగాలు ఈ నెలాఖరున ఉజ్బెకిస్థాన్, ఈక్వెడార్, పాకిస్థాన్, ఇండోనేషియా దేశాల్లో ప్రారంభమవుతాయని అన్హుయి తెలిపింది. ఈ ప్రయోగాలు ప్రపంచం మొత్తం మీద 29వేల మంది వాలంటీర్లపై జరుగుతాయని పేర్కొంది.
వ్యాక్సిన్ ప్రయోగాలు సక్సెస్ అయితే.. ఏడాదికి 300 మిలియన్ డోసులు తయారు చేసే సామర్ధ్యం ఉందని కూడా అన్హుయి పేర్కొంది. ప్రస్తుతం చైనాలో అయిదు వ్యాక్సిన్లు మూడో దశలో ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రయోగాలు బ్రెజిల్, పెరూ, యూఏఈ, పాకిస్థాన్.. తదితర దేశాల్లో జరుగుతున్నాయని తెలుస్తోంది.
302392 164890I undoubtedly didnt comprehend that. Learnt some thing new nowadays! Thanks for that. 996388
279592 889892Wohh exactly what I was looking for, regards for putting up. 941926
783050 485383Thanks for the details provided! I was locating for this data for a long time, but I wasnt able to find a reliable source. 599878
518018 199875Some times its a pain inside the ass to read what people wrote but this site is real user genial ! . 660665