Switch to English

125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం: అప్పుడు బాబు, ఇప్పుడు జగన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు గతంలో చంద్రబాబు సర్కార్‌ ప్రయత్నించింది. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్ళూరులో ఇందు కోసం భూమిని కూడా కేటాయించారు. డిజైన్లు ఖరారయ్యాయి. 125 అడుగుల ఎత్తున వుండే విగ్రహాన్ని ప్రతిష్టించాలన్నది చంద్రబాబు సర్కార్‌ అప్పట్లో రచించిన ప్లాన్‌.

ఇక, ఇప్పుడు ప్రస్తుత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదాన్‌లో 125 అడుగుల ఎత్తు గల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. జులై 8న ఈ ప్రాజెక్ట్‌కి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన పనులు ప్రారంభిస్తారు. స్వరాజ్య మైదానం పేరుని కూడా, అంబేద్కర్ స్వరాజ్య మైదానంగా మార్చనున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 125 అడుగుల ఎత్తయిన విగ్రహంతోపాటుగా అంబేద్కర్‌ ఆలోచనలు, సిద్ధాంతాలు ప్రతిబింబించేలా మెమోరియల్‌ హాల్‌, లైబ్రరీ, స్టడీ సెంటర్‌ వంటివి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అత్యద్భుతమైన ల్యాండ్‌ స్కేపింగ్‌, గార్డెన్‌, ఓపెన్‌ ఎయిర్‌ ది¸యేటర్‌ వంటివి ఇక్కడ ఇతర ప్రధాన ఆకర్షణలుగా వుంటాయట.

దాదాపుగా వీటన్నిటినీ గతంలో తుళ్ళూరులో డిజైన్‌ చేసిన ప్రాజెక్టులోనూ పొందుపరచాలనుకున్న విషయం విదితమే. అన్నట్టు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహా ఆలోచన చేసినా, ఆ ప్రాజెక్ట్‌ ఇప్పుడు ఏమయ్యిందో ఎవరికీ తెలిసని పరిస్థితి. మరి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో, ఎంత త్వరగా ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేస్తుందోనన్న ప్రశ్న తలెత్తడం సహజమే కదా.! ఇదిలా వుంటే, స్వరాజ్య మైదాన్‌ విషయంలో అనేక రాజకీయ వివాదాలున్నాయి. కొందరు రాజకీయ పెద్దలు ఈ భూమిపై కన్నేశారంటూ నానా యాగీ జరిగింది, జరుగుతూనే వుంది. దీన్నొక కమర్షియల్‌ యాక్టివిటీ సెంటర్‌గా మార్చాలనే ప్రయత్నాలూ జరిగాయి. ఈ నేపథ్యంలో బోల్డన్ని ఆందోళనలు కూడా చోటు చేసుకున్నాయి.

ఇక, ఇప్పుడు అంబేద్కర్‌ మెమరియల్‌గా ఈ ప్రాంతాన్ని మార్చాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న దరిమిలా, వివాదాలకు పెద్దగా ఆస్కారం వుండకపోవచ్చు. అయితే, తుళ్ళూరులో ప్లాన్‌ చేసిన అంబేద్కర్‌ మెమోరియల్‌ మాటేమిటి.? అది కాలగర్భంలో కలిసిపోయినట్లేనా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...