నెల రోజుల ముందు వరకు సినీ ప్రముఖుల్లో ఒక్కరు ఇద్దరు మాత్రమే కరోనా బారిన పడ్డారు. కాని ఈ నెల రోజుల్లో పదుల సంఖ్యల్లో సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ప్రతి రోజు ఎవరో ఒకరి గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ నుండి మొదలుకుని తాజాగా దర్శకుడు రాజమౌళి మరియు తేజ కరోనా బారిన పడటం వరకు ఎంతో మంది సినీ ప్రముఖులు సెలబ్రెటీలు కరోనాతో పోరాడుతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
నేడు మరో సినీ సెలబ్రెటీ కరోనా బారిన పడ్డట్లుగా ప్రకటన వచ్చింది. హాయ్రబ్బ స్మితగా పేరు దక్కించుకున్న పాప్ సింగర్ స్మితకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కరోనా గురించి చాలా జాగ్రత్తలు చెప్పారు. ఇప్పుడు ఆమె కరోనా బారిన పడటంతో ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ టైంలో స్మిత చాలా మంది వలస కార్మికులకు సాయం చేశారు.
స్మితకు కరోనా ఎవరి ద్వారా సోకింది అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా ఆమె ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. సింగర్ గా ఎన్నో పాటలు పాడిన స్మిత నటిగా కూడా రాణించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న ఆమె ఇలా కరోనా బారిన పడటంతో ఆమె అభిమానులు మరియు ఆమె వద్ద పని చేసే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానుల తరపున మా తరపున కోరుకుంటున్నాం.
Mad mad day yesterday. Had some body pains which I thought was due to heavy workout but got tested to be on safe side. Shashank & I tested covid positive. Mostly asymptomatic. Waiting to kick Covid out, donate plasma & chill🤘🏼 We Stayed Home Stayed Safe but Covid came home 😁
— Smita (@smitapop) August 4, 2020
323403 644968This will be a great web site, could you be interested in doing an interview about just how you developed it? If so e-mail me! 714919
421221 346213I enjoy the helpful information you give inside your articles. 814023