Switch to English

పోతున్నారు.! వదిలిపోతున్నారు జగనన్నా.! వైనాట్ సింగిల్ డిజిట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

పార్టీని గెలిపించే సత్తా వున్న నాయకులంతా ఒకరొకరుగా వైసీపీని వీడుతున్నారు. జగనన్న భజనలో మునిగి తేలుతున్నవాళ్ళేమో, టిక్కెట్టు రాకపోయినా వైసీపీలోనే వుంటామంటూ, అధినేత మెప్పు పొందుతూ, టిక్కెట్లను దక్కించుకుంటున్నారు.

‘పార్టీ కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశాం. మా చెప్పుతో మేం కొట్టుకోవాలిప్పుడు..’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నిన్న కన్నీటి పర్యంతమవుతూ వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. డజను మంది కాదు, ఆ పైన.. రానున్న రోజుల్లో వైసీపీని వీడబోతున్నారట. వీళ్ళంతా ప్రజా ప్రతినిథులు, పైగా వైసీపీకి సామాజిక వర్గం కోణంలోనూ, ఆర్థిక కోణంలోనూ ఎంతో బలంగా నిలబడినోళ్ళే.!

‘నేనైతే పార్టీ మారను..’ అని చెబుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎప్పటికప్పుుడు అనుచరులతో, స్థానిక పరిస్థితులపై మంతనాలు జరుపుతున్నారు. ఇతర పార్టీల నుంచి వస్తున్న ఆఫర్ల గురించి ఆరా తీస్తున్నారు, పరిస్థితుల్ని విశ్లేషించుకుంటున్నారు.

అసలేం జరుగుతోంది వైసీపీలో.? అధినాయకత్వాన్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు.? ఈ విషయమై వైసీపీ శ్రేణుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. అధినేత వైఎస్ జగన్ ఒకప్పటిలా లేరనీ, తల్లిని దూరం చేసుకోవడం.. చెల్లినీ దూరం చేసుకోవడం.. ఇవేవీ పార్టీకి క్షేమం కాదనీ ఇప్పుడు తీరిగ్గా వాళ్ళంతా బాధపడుతున్నారు.

‘ఇలాగైతే వై నాట్ 175 కాదు.. వై నాట్ సింగిల్ డిజిట్.. అవ్వొచ్చు..’ అన్నది వైసీపీలో జరుగుతున్న చర్చ. ‘గెలుపు గుర్రాలకే టిక్కెట్లు..’ అంటూ, రాత్రికి రాత్రి ఊరూ పేరూ లేని వ్యక్తుల్ని తెరపైకి తెచ్చి, ఇన్‌ఛార్జిలుగా ప్రకటించి, టిక్కెట్లు ఇస్తున్న వైనం మరింతగా వైసీపీ శ్రేణుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టిక్కెట్టు ఖాయం చేసుకున్న వైసీపీ ఎంపీ ఒకరు, ఆ పార్టీకి దూరమయ్యే ఆలోచన చేస్తున్నారట. జనసేనతో ఆ ఎంపీ టచ్‌లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. తనతోపాటు మరో ఎంపీని కూడా ఆ నేత జనసేనలోకి తీసుకెళ్ళనున్నారట.

రానున్న రోజుల్లో పెరగబోయే వలసలు, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి రాబోయే సీట్లను డిసైడ్ చేస్తాయనడం నిస్సందేహం.! మరీ సింగిల్ డిజిట్ అనలేంగానీ, వైసీపీకి గట్టిగా యాభై సీట్లు వస్తే గొప్పేనన్నది తాజా అంచనా.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...