Switch to English

ముసలితనం ఎవరిది.? పడుచు పిల్లాడు ఎవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి ఏం చేశారు.? అన్నది వైసీపీ చెప్పుకోగలగాలి. కానీ, అలా చెప్పుకోవడానికి వైసీపీ గడచిన మూడేళ్ళలో రాష్ట్రానికి చేసిందేమీ లేదు కదా.! రైతులకు వేల కోట్లు ఇచ్చేస్తున్నాం.. విద్యార్థుల మీద వేల కోట్లు ఖర్చుపెట్టేస్తున్నాం.. పెన్షన్లు ఇచ్చేస్తున్నాం.. అంటూ లెక్కలు చెప్పేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఇంతకీ, ఆ డబ్బులన్నీ ఏమయిపోతున్నాయ్.?

సంక్షేమం అంటే, దానివల్ల తాత్కాలిక ప్రయోజనం తప్ప, శాశ్వత ప్రయోజనం ఏమీ వుండదు. ఇది బహిరంగ రహస్యం. కానీ, ఓటు బ్యాంకు రాజకీయాల్లో సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారంతా. గతంలో చంద్రబాబు హయాంలోనూ సంక్షేమం చుట్టూనే ఫోకస్ కనిపించింది. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో సంక్షేమ పథకాల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు నడుస్తున్నాయి.

ఇద్దరూ ఆ తానులోని గుడ్డ పీలికలే. అక్కడే వస్తోంది అసలు సమస్య. అస్సలేమాత్రం తేడా లేదు. ఒకరు నడిచిన దారిలోనే ఇంకొకరు నడుస్తున్నారు. పైగా, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ‘మేం అధికారంలోకి వచ్చాక, వైఎస్ జగన్ దోచుకున్న సొమ్ముని రికవరీ చేసి, ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తాం..’ అని చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో సెలవిచ్చారు. జమ చేశారా.? చెయ్యరుగాక చెయ్యరు.!

‘చంద్రబాబునీ, ఆయన కొడుకు లోకేష్‌నీ జైలుకు పంపిస్తాం.. అమరావతి పేరుతో బొక్కేసిందంతా కక్కిస్తాం.. రాష్ట్ర ఖజానాకి ఆ మొత్తాన్ని జమ చేస్తాం..’ అంటూ వైసీపీ, 2019 ఎన్నికల్లో నినదించింది. చేసిందా.? చెయ్యలేదాయె.! చెప్పే మాటలకీ, చేస్తున్న చేతలకీ అస్సలు పొంతన వుండదు.. అదే బులుగు పచ్చ రాజకీయమంటే.

పైగా, ‘ముసలితనం’ గురించి వైసీపీ వర్సెస్ టీడీపీ.. జుగుప్సాకరమైన చర్చ జరుగుతోంది. చంద్రబాబుని ముసలి నక్క.. అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శిస్తే, ఆ విజయసాయిరెడ్డిని పండు కోతి.. అంటోంది తెలుగుదేశం పార్టీ. ఇదెక్కడి పంచాయితీ.?

చంద్రబాబు వయసెంత.? విజయసాయిరెడ్డి వయసెంత.? కాస్త అటూ ఇటూగా ఇద్దరి వయసూ ఒకటే.! చూస్తోంటే, ఇదంతా టీడీపీ, వైసీపీ కలిసి ఆడుతున్న నాటకంగానే కనిపిస్తోంది. అక్కడికేదో రెండు పార్టీల మధ్యా నిజంగానే రాజకీయ వైరం వున్నట్లు డ్రామాలు ఆడుతున్నారన్న అనుమానాలకు ఇప్పుడిప్పుడే మరింత బలం చేకూరుతోంది.

వైసీపీ పాలనా వైఫల్యాలు బయటపడకుండా వుండేందుకోసం, విజయసాయిరెడ్డిని రంగంలోకి దించడం.. విజయసాయిరెడ్డి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ అవడం.. నాలుగు తిట్లు తిట్టి, నాలుగు వందల నలభై నాలుగు తిట్లు తినడం.. ఇదంతా చూస్తోంటే, ఈ రాజకీయ ‘ముసలితనం’ ప్రజల్ని వంచించడానికేనన్న డౌట్ రాకుండా ఎందుకు వుంటుంది.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...