వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. గతంలో నగ్నంగా వీడియోకాల్ చేసి దొరికిపోయారనే ఆరోపణలు ఎదుర్కొన్నారీయన. పోలీస్ ఉద్యోగం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల మాధవ్, రాజకీయాల్లోకి వస్తూనే ఎంపీగా వైసీపీ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే.
గతంలో టీడీపీ నేత, అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో గొడవ కారణంగా, పోలీస్ అధికారిగా వున్న గోరంట్ల మాధవ్ పేరు మార్మోగిపోయింది. అందుకు బహుమతిగా వైసీపీ, ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, ఎంపీని చేసింది.
వల్గర్ లాంగ్వేజ్ వాడటంలో గోరంట్ల మాధవ్ తర్వాతే ఎవరైనా.. అన్న ఆరోపణలున్నాయి. అంతే కాదు, దౌర్జన్యాలకు పెట్టింది పేరు.. అని కూడా గోరంట్ల మాధవ్ గురించి విమర్శలున్నాయి.
తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఛస్తాడు’ అంటూ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. వైసీపీ చేపట్టిన బస్సు యాత్ర సందర్భంగా గోరంట్ల మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ జగన్ వస్తారు.. చంద్రబాబు ఛస్తాడు.. అన్నది గోరంట్ల మాధవ్ ఉవాచ.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి, రాజమండ్రి కేంద్ర కారాగంలో రిమాండు ఖైదీగా వున్న చంద్రబాబు, తనకు ప్రాణ హాని వుందంటూ న్యాయస్థానాన్ని వేడుకుంటున్న సంగతి తెలిసిందే.
సరిగ్గా, ఇదే సమయంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, ‘చంద్రబాబు ఛస్తాడు’ అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జైల్లోనే తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారంటూ సవివరంగా చంద్రబాబు, న్యాయస్థానానికి లేఖ రాసిన విషయం విదితమే.
My famikly members always say tat I am kijlling my time here at net,
howesver I know I am getting experience all thhe
tjme bby reading sucdh pleasant posts.