Switch to English

రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన వైఎస్ షర్మిల.! అసలేంటి కథ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,572FansLike
57,764FollowersFollow

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం జరగబోతోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిలకు, కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కూడా దక్కబోతోందనీ, ఆమె కడప ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనీ ప్రచారం జరుగుతోంది.

అయితే, పార్టీ విలీనంపై ఇంతవరకు వైఎస్ షర్మిల స్పష్టమైన ప్రకటన అయితే చేయలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీతో మాత్రం తెరవెనుకాల సన్నిహితంగా మెలుగుతున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. గతంలో ఆమె బీజేపీకి కొంత అనుబంధంగా పనిచేసినట్లు రాజకీయంగా ఆరోపణలు వచ్చాయి.

ఏమయ్యిందోగానీ, ఇప్పుడామె కాంగ్రెస్ గూటికి చేరాలని తహతహలాడుతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేపథ్యంలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ట్వీటేశారు. కాంగ్రెస్ నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలు, అలాగే ముఖ్యమంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి అందించిన సేవల్ని రాహుల్ తన ట్వీటులో గుర్తు చేసుకున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రాహుల్ గాంధీ గుర్తు చేసుకోవడం పట్ల వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశా. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. వాస్తవానికి, కాంగ్రెస్ పార్టీని కాలగర్భంలో కలిపేస్తామంటూ, వైఎస్ జగన్ అలాగే వైఎస్ విజయమ్మ.. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో అయితే, కాంగ్రెస్ పార్టీ పతనాన్ని చూడగలిగారు వైఎస్ జగన్. ఆ జగన్ కోసం గతంలో పాదయాత్ర కూడా చేసిన వైఎస్ షర్మిల, ఏపీ రాజకీయాల్ని వదిలేసి, తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టాల్సి వచ్చింది. కానీ, తెలంగాణలో రాజకీయం కలిసి రాక, తిరిగి ఏపీ రాజకీయంపై దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. రాహుల్‌కి వైఎస్ షర్మిల ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారంటే.. కాంగ్రెస్ పార్టీకి ఆమె దాదాపు దగ్గరైనట్లే భావించాలేమో.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vishwak Sen: ఆయన వల్ల నాకే ఎక్కువ నష్టం జరిగింది: విశ్వక్...

Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) .. తమిళ హీరో అర్జున్ దర్శకత్వంలో సినిమా విషయంలో ఇరువురి మధ్యా వివాదం తలెత్తిన సంగతి...

ఎంఎం కీరవాణి చేతుల మీదుగా లిరికల్ సాంగ్ రిలీజ్

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి". కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున...

Ram Charan: రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్..! క్లారిటీ...

Ram Charan: 90వ దశకంలో తెలుగు తెరపై కనువిందు చేసిన జంట మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)-శ్రీదేవి (Sridevi). వారిద్దరూ నటించిన ‘జగదేకవీరుడు అతిలోక...

మమ్ముట్టి ‘భ్రమయుగం’ ను తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ 'భ్రమయుగం' తెలుగులో ప్రతిష్టాత్మక సితార...

ఉచిత ఐ క్యాంప్ లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యాంకర్ సుమ కనకాల ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర...

రాజకీయం

వైసీపీ వాలంటీర్లు.! అసలేమనుకుంటున్నారు.?

2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా ‘రాష్ట్ర ప్రజల నెత్తిన ‘వాలంటీర్ వ్యవస్థని’ రుద్దింది.. అదీ బలవంతంగా.! వాలంటీర్లంటే ఎవరో కాదు, రాష్ట్ర ప్రజలే.! మరీ...

ఔను, ఫ్యాను.. ఇంట్లోనే వుండాలి.! వుంచాలి కూడా.!

‘ఫ్యాను ఇంట్లోనే వుండాలి.. సైకిల్ బయటే వుండాలి.. టీ తాగేశాక గ్లాసు సింక్0లో వుండాలి..’ అంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. అదేనండీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

సిద్ధం.! తొందరపడి ఓ కోయిల.. ముందే కూసింది.!

ఎన్నికల బహిరంగ సభలు వేరు.. ఎన్నికల ముందర బహిరంగ సభలు వేరు.! అధికార పార్టీ, చివరి రోజుల్లో.. అధికారాన్ని విచ్చలవిడిగా వాడేయడం అనేది సర్వసాధారణం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు...

Kamal Haasan: ‘2 రోజుల్లో గుడ్ న్యూస్..’ హీట్ పెంచిన కమల్ హాసన్ కామెంట్స్

Kamal Haasan: ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఓవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉన్నారు కమల్ హాసన్. ‘రెండు...

Suman: ‘టీడీపీ-జనసన గాలి వీస్తోంది..’ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్

Suman: అడపాదడపా రాజకీయాలపై స్పందించే హీరో సుమన్ (Suman) ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ (Tdp)-జనసేన (Janasena) కూటమి గెలుపు ఖాయమని...

ఎక్కువ చదివినవి

‘సుందరం మాస్టర్’ పెద్ద విజయాన్ని సాధించాలి : మెగ్టాసార్ చిరంజీవి

ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద...

వైసీపీ వాలంటీర్లు.! అసలేమనుకుంటున్నారు.?

2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా ‘రాష్ట్ర ప్రజల నెత్తిన ‘వాలంటీర్ వ్యవస్థని’ రుద్దింది.. అదీ బలవంతంగా.! వాలంటీర్లంటే ఎవరో కాదు, రాష్ట్ర ప్రజలే.! మరీ...

Yash: భార్య కోసం ఐస్ క్యాండీ.. కిరాణా షాప్ కు వెళ్లిన హీరో యశ్..

Yash: భార్యను సంతోషం కోసం భర్తలు దేశాలు తిప్పక్కర్లేదు.. ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు.. ప్రేమతో చాక్లెల్స్ కొనిచ్చినా చాలని నిరూపించాడు కన్నడ స్టార్ హీరో యశ్ (Yash). భార్య కోసం బజార్లో చిన్న...

చొక్కాలు మడతబెట్టి.. కుర్చీలు మడతబెట్టి.! ఇదా రాజకీయం.?

ఒకాయన చొక్కాలు మడతబెట్టమంటాడు.. ఇంకొకాయనేమో కుర్చీలు మడతబెట్టమంటాడు.! సినిమాల్లో వ్యవహారం వేరు. నిజానికి, సినిమాల్లోనూ ‘కుర్చీ మడతబెట్టడం’ అనే ప్రస్తావన అత్యంత దిగజారుడుతనం. ‘గురూజీ’ అనే గౌరవం దక్కించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్...

వైసీపీకి అమ్ముడుపోయిన టీడీపీ ’కుల‘ మీడియా.!

జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి.? అన్న విషయమై తెలుగుదేశం పార్టీలో అంతర్గత చర్చ జరిగితే సరిపోదు.! టీడీపీ - జనసేన మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరగాలి.! రెండు పార్టీలూ కలిసి...