Switch to English

వైఎస్ షర్మిల చెబుతున్న రాజకీయ సత్యాలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

తెలంగాణలో కేసీయార్ కుటుంబమే బాగుపడిందని అంటున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. ప్రగతి భవన్‌లో తనిఖీలు చేస్తే వేల కోట్లు బయటపడతాయట. కేసీయార్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కుటుంబం మాత్రమే బాగుపడిందట.! పెద్ద పెద్ద ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారంటూ కేసీయార్ మీద వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.

మరి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంగతేంటి.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటేమిటి.? వైఎస్ షర్మిల పరిస్థితేంటి.? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డగోలుగా అక్రమాస్తులు కూడగట్టారన్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వున్న అభియోగం. ఈ అభియోగం మీదనే ఆయన జైలుకు వెళ్ళారు కూడా. మరి, అప్పట్లో అన్న తరఫున వైఎస్ షర్మిల ఎలా వకాల్తా పుచ్చుకున్నట్టు.?

‘తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించావ్..’ అని ఆనాడు అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైఎస్ షర్మిల ఎందుకు నిలదీయలేదు.? అన్న ప్రశ్న తెలంగాణ సమాజం నుంచి వస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2004 ఎన్నికల సమయంలో ఆస్తులమ్మి రాజకీయాలు చేశారంటారు. మరి, వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయన కుటుంబం ఎలా ఆస్తుల్ని కూడగట్టిందట.? అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ప్రశ్నిస్తున్నారు.

ప్రగతి భవన్‌లో తనిఖీలు చేస్తే వేల కోట్లు దొరుకుతాయో.. మీ అన్న నివాసం తాడేపల్లిలో వేల కోట్లు దొరుకుతాయో.. అంటూ గులాబీ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా సెటైర్లేస్తున్నారు. ‘మీ బాబాయ్ దారుణ హత్యకు గురయ్యారు.. ఆ హత్య కేసుపై మీరు చేపట్టిన ఉద్యమాలేంటి.?’ అనే ప్రశ్నలూ షర్మిల మీదకు దూసుకెళుతున్నాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీద వైఎస్ షర్మిల విమర్శలు చేస్తే, ఆమెని బీజేపీ వదిలిన బాణ:గా అభివర్ణించారాయన. ‘క్రెడిబులిటీ లేనోళ్ళు ఏవేవో మాట్లాడతారు.. వాటి గురించి నా దగ్గర మీరు ప్రశ్నిస్తారా.?’ అంటూ మీడియా మీద రుసరుసలాడారు వైఎస్ షర్మిల. అసలు వైఎస్ షర్మిలకి వున్న క్రెడిబులిటీ ఏంటి.? ఆమె స్థాయి ఏంటి.? అని జగ్గారెడ్డి ప్రశ్నిస్తున్నారు.

మొత్తమ్మీద, తెలంగాణ రాజకీయాల్లో సందడి చేస్తోన్న వైఎస్ షర్మిల, తెలుగు రాష్ట్రాల్లో బోల్డంత ఎంటర్టైన్మెంట్‌కి కారణమవుతున్నారు. కేసీయార్ మీద ఆమె చేస్తోన్న ప్రతి విమర్శా.. అటు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికీ, ఇంకోపక్క ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ గట్టిగా తగిలేస్తున్నాయి.. కానీ, ఆమె అసలు టార్గెట్ కేసీయార్ అయినా, అటు వైపుగా ఆ విమర్శలు అంత దూకుడుగా వెళ్ళలేకపోతున్నాయ్.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...