ఒకే రోజు దాదాపు 25 లక్షల ఇళ్ళ స్థలాల్ని పేదలకు ఇవ్వాలని గతంలో వైఎస్ జగన్ సర్కార్ సంకల్పించింది. ఆ లెక్క, ఆ తర్వాత 30 లక్షలకు చేరుకుంది. గడచిన ఏడాది కాలంలో వైఎస్ జగన్ సర్కార్ అనేక సంక్షేమ పథకాల్ని తెరపైకి తెచ్చిన విషయం విదితమే. అందులో వైఎస్ జగన్ ‘కలల పథకం’గా చెప్పుకోదగ్గది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం. ఇందుకోసం కసరత్తులు ఓ రేంజ్లో జరిగాయి.
చంద్రబాబు హయాంలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు పెద్దయెత్తున నిర్మాణాలు జరిగాయి. కేంద్రం – రాష్ట్రం సంయుక్తంగా ఈ బృహత్తర ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారుల కోసం నిర్మాణాలు చేపట్టారు. కొన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ఇంకొన్ని నిర్మాణాలు 80 నుంచి 90 శాతం వరకు పూర్తయ్యాయి కూడా. కానీ, వాటిని పేదలకు ఇచ్చేందుకు వైఎస్ జగన్ సర్కార్ గడచిన ఏడాదిలో ప్రయత్నించిన దాఖలాల్లేవు. పే
దోడికి ఎంత ఎక్కువ మేలు చేసినా అభినందించి తీరాల్సిందే. ఆపార్ట్మెంట్ల తరహాలో కాదు, ఇంటి స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ సంకల్పాన్ని తప్పు పట్టలేం. కానీ, ఈ క్రమంలో భూ సమీకరణ చాలా వివాదాస్పదమయ్యింది. మార్చి నెలాఖరున జరగాల్సిన ఇళ్ళ స్థలాల పంపిణీ వాయిదా పడింది. ఆ తర్వాత పలు డేట్స్ మారి, జులై 8వ తేదీకి వచ్చింది. తాజాగా ఆగస్ట్ 15వ తేదీకి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈలోగా వర్షాలొచ్చాయి. ప్రభుత్వం ప్లాట్లుగా మార్చిన స్థలాల్లో ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోయింది. కొన్ని మోకాలు లోతులో.. ఇంకొన్ని అయితే ఇంకా ఎక్కువ లోతులో మునిగిపోయాయి. పరిస్థితిని చూస్తోన్న లబ్దిదారులు ప్రభుత్వమ్మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ స్థలాల్లో మాకు ఇళ్ళ పట్టాలు ఇస్తే, ఇళ్ళు ఎలా కట్టుకుంటాం.? కట్టుకున్నాక మునిగిపోతే మా పరిస్థితి ఏంటి.?’ అని ప్రశ్నిస్తున్నారు.
మరోపక్క, టీడీపీ తమ హయాంలో నిర్మితమైన అపార్ట్మెంట్ల ఫొటోల్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దాంతో, ఆటోమేటిక్గా ప్రజల్లో జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. ‘వాటి కోసం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు..’ అంటూ టీడీపీపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా, ఆ విమర్శల్లో ‘స్పష్టత’ కన్పించని పరిస్థితి. ఆగస్ట్ 15 నాటికి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా వుంటాయో.! పైగా టీడీపీనే కోర్టుకెళ్ళి ఆపేయించిందని వైసీపీ చెబుతోంది. ఆ లెక్కన, అప్పటికి కూడా కోర్టు నుంచి అనుమతులు రాకపోతేనో.? ఈలోగా ‘ముంపు భూములు’ అనే విమర్శల నుంచి ప్రభుత్వమెలా తప్పించుకోగలుగుతుంది.?
721681 230218Really effectively written story. It will be helpful to every person who utilizes it, as properly as myself. Maintain up the great work – i will undoubtedly read far more posts. 596938
970840 126040hey great web site i will definaely come back and see once more. 593396
548251 54951Id need to verify with you here. Which is not one thing I usually do! I take pleasure in reading a submit that will make individuals feel. Additionally, thanks for permitting me to remark! 405457