Switch to English

కేసీఆర్‌కి వైఎస్‌ జగన్‌ ఝలక్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఎన్నికల వేళ ఈ పరిణామాలు అత్యంత వేగంగా మారడం చూస్తుంటాం. ఇప్పుడూ అదే జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు పాత గూటికి చేరేలా కన్పిస్తోంది. సాక్షాత్తూ సోనియాగాంధీ, కేంద్రంలో బీజేపీ యేతర కూటమి కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సాయాన్ని కోరుతున్నారు. మరోపక్క టీఆర్‌ఎస్‌ని కూడా తమ కూటమిలోకి రావాల్సిందిగా సోనియా ఆహ్వానించడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతున్నట్లే కన్పిస్తోంది.

మే 23న సార్వత్రిక ఫలితాలు రానుండగా, సోనియాగాంధీ రాజకీయంగా చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, బీజేపీతో కొంత సఖ్యతగా వున్న టీఆర్‌ఎస్‌, బీజేపీని కాదని కాంగ్రెస్‌ వైపుకు వెళ్ళడం కష్టమే. కానీ, ఇక్కడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కాంగ్రెస్‌ వైపుకు వెళ్ళడానికి ఓ అవకాశం గట్టిగా కన్పిస్తోంది. అదే ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఇస్తే ఎవరికైనా మద్దతునిస్తామని గతంలోనే వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఆ ప్రత్యేక హోదా మీదనే తొలి సంతకం పెడతామని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విదితమే.

పరిణామాలు ఇలా మారతాయని ఊహించని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ షాక్‌కి గురయ్యారట. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌తో తాజా పరిణామాలపై చర్చించారట. ‘బీజేపీ ఎలాగూ ప్రత్యేక హోదా ఇవ్వదు. కాబట్టి, మేం ప్రత్యేక హోదా కోసం చేసే ఉద్యమంలో పోరాటమంతా బీజేపీతోనే చేయాల్సి వుంటుంది. ఫెడరల్‌ ఫ్రంట్‌కి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ పరిస్థితుల్లో మా ముందున్న ఆప్షన్‌ కాంగ్రెస్‌ ఒక్కటే’ అని వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌కి స్పష్టం చేశారనే ప్రచారమొకటి బయటకు వచ్చింది.

ఈ ప్రచారమే గనుక నిజమైతే, కాంగ్రెస్‌ పార్టీతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలవడం ఖాయమే అవుతుంది. కానీ, కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమిలో తెలుగుదేశం పార్టీ బలమైన రాజకీయ శక్తిలా కన్పిస్తోంది. అదొక్కటే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పెద్ద ఇబ్బంది అని కూడా అంటున్నారు. కానీ, బీజేపీని ఎదుర్కొనే క్రమంలో వైసీపీని కూడా కలుపుకుపోతామనీ ఒకరిద్దరు టీడీపీ నేతలు మీడియా చర్చా కార్యక్రమాల్లో చెబుతుండడం గమనించాల్సిన విషయం.

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఒకవేళ దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్‌తోపాటు వైసీపీ కూడా చేరితే అదో సరికొత్త రాజకీయ సమీకరణగా మారుతుంది. టీడీపీ ఎలాగూ ఈ కూటమిలోనే వుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ కూడా ఇటువైపు వస్తుందా? ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనలు ఫలించడంలేదు కాబట్టి, కేసీఆర్‌ అడుగులు కూడా కాంగ్రెస్‌ వైపుకే వుంటాయా? వేచి చూడాలిక.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...