Switch to English

జగన్ ఎఫెక్ట్ : తెరపైకి ప్రత్యేక ఆంధ్రా…

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

151 స్థానాల్లో జగన్ పార్టీని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే… జగన్ మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని చెప్పి, మొదట్లో మంచివాడిగా పేరు తెచ్చుకొని ఆ తరువాత జగన్ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. మంచి వాడిగా పేరు తెచ్చుకుంటా అని చెప్పిన జగన్ కొన్నాళ్ళు మంచిగానే ఉండి… ఆ తరువాత హడావుడి చేయడం మొదలుపెట్టాడు. శీతాకాల అసెంబ్లీ చివరి రోజున జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ప్రజల మధ్య విద్వేషాలు రేపాయి. 2013 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కోసం పోరాం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంచాలని, లేదంటే ఉద్యమం చేస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పినట్టుగానే పోరాటం చేశారు. కానీ, తెలంగాణను చేజార్చుకోవాల్సి వచ్చింది. సరే ఆంధ్రప్రదేశ్ ఉన్నది కదా సరిపెట్టుకుందాం అనుకుంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎఫెక్ట్ పడింది. గత ప్రభుత్వం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించి కొన్ని కట్టడాలు నిర్మించారు. ప్రభుత్వం మారింది. ఆరు నెలలపాటు కామ్ గా ఉన్న వైకాపా ప్రభుత్వం ఇప్పుడు ఆలోచనలు మార్చుకున్నది.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఒక్కటి సరిపోదని చెప్పి ఏకంగా మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది. మూడు రాజధానుల ప్రకటన అందరికి నచ్చుతుందని అనుకున్నారు. బెడిసికొడుతుందని వైకాపా భావించలేదు. మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి ప్రాంతం అట్టుడికిపోతోంది. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన లాయర్లు విజయవాడలోని కృష్ణా నది బ్రిడ్జీపై ఆందోళన చేసేందుకు సిద్ధం అయ్యారు.

అయితే, దీనిని అడ్డుకోవడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా కృష్ణా నది వంతెనను మూసేసింది. పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. లాయర్లను అడ్డుకుంటున్నారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నానిని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ దీనిని చీకటిరోజుగా అభివర్ణిస్తూ ఆందోళనకు దిగింది. ప్రస్తుతం విజవాడలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు.

ఒకవేళ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే భవిష్యత్తులో పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో కూడిన ప్రత్యేక ఆంధ్రా కోసం ఉద్యమం జరిగేలా కనిపిస్తోంది. ఒకవేళ ఈ ఉద్యమం కనుక తెరపైకి వస్తే… 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కాస్త మూడు రాష్ట్రాలుగా విడిపోతుంది. ఇదే జరిగితే అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...