కరోనాతోపాటు బ్లాక్ ఫంగస్ కలవరపెడుతుంటే.. కొత్తగా వైట్ ఫంగస్ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు వీటిని మించి ‘ఎల్లో ఫంగస్’ అనే కొత్తరకం ఫంగస్ వెలుగుచూడటం ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ వ్యక్తిలో ఈ ఎల్లో ఫంగస్ ను గుర్తించారు వైద్యులు. ఇది బ్లాక్, వైట్ ఫంగస్ కంటే మరింత ప్రమాదకరం అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫంగస్ కు గురైన వ్యక్తి స్థానిక ఈఎన్ టీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆకలి తగ్గిపోవడం, బ్ధకం, బరువు తగ్గిపోవడం లక్షణాలు ఉంటాయి. కణజాలం దెబ్బతిని కళ్లకు హాని కలుగుతుంది. ఫంగస్ సోకిన సమయంలో ఒంటికి గాయాలైతే మరింత ముదిరిపోతాయి. గాయాల చీము కారి నివారణ కష్టమవుతుంది. లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించకపోతే ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు అంటున్నారు. అపరిశుభ్రత ఈ ఫంగస్ కు కారణమవుతుంది. పాచిపోయిన ఆహార పధార్ధాలు, మల విసర్జితాలను తొలగించి ఈ ఫంగస్ పెరుగుదలను నివారించవచ్చు. ఇంట్లోని తేమ ఫంగస్ పెరుగుదలకు ఓ కారణం అవుతుంది.
314667 109852Awesome inkling Grace! ego was luxurious youd bring about this about your biz bump into upstanding lineage. We reason you! 673297