Switch to English

టీడీపీ రాజీనామాస్త్రం తీస్తుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఏపీకి మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినదిస్తున్న తెలుగుదేశం పార్టీ.. తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తోంది. ఇందుకు అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ సమీకరిస్తోంది. ముఖ్యంగా ఒక వర్గం మీడియా కూడా వారికే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మిగిలిన ప్రాంతాల ప్రజలు సైతం రాజధానిగా అమరావతే ఉండాలని చెబుతున్నారంటూ కథనాలు గుప్పిస్తోంది.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు ఓ ప్రతిపాదన చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలంటే గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో అధికార వైఎస్సార్ సీపీ శాసనసభ్యులు సైతం ముందుకు రావాలని కోరారు. అయితే, ఈ ప్రతిపాదనపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఉద్యమం జరుగుతుంటే ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజా మద్దతు కూడగట్టారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు అలాగే చేయాలని పలువురు పేర్కొంటున్నారు.

ఒకవేళ అమరావతి ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తిరిగి వారే ఎన్నికవుతారు. అది రాష్ట్రం మొత్తం ప్రజల అభిప్రాయానికి ప్రాతిపదిక కాదు. అందువల్ల టీడీపీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలు (వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు) రాజీనామాలు చేసి, ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రజా తీర్పు కోరాలని.. ఆ ఉప ఎన్నికల్లో వారంతా తిరిగి ఎన్నికైతే రాజధానిగా అమరావతికే అందరూ మొగ్గు చూపిస్తారని అనుకోవచ్చని పేర్కొంటున్నారు.

అయితే, ఇందుకు టీడీపీ ముందుకు వస్తుందా రాదా అన్నది చెప్పలేం. ఒకవేళ ఉప ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఈ నేపథ్యంలో రాజీనామాల జోలికి వెళ్లకుండా ఇతరత్రా అంశాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని సమాచారం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...