Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తె కవిత అడ్డంగా బుక్కయిపోయారన్న చర్చ ఈనాటిది కాదు. గతంలోనూ ఆమెను దర్యాప్తు సంస్థలు విచారించాయి. అప్పట్లో విచారణకు సహకరించిన కవిత, ఇంకోసారి విచారణకు సైతం ‘సై’ అంటున్నారు.
‘నేనేమీ తప్పు చేయడంలేదు.. దాక్కోవడంలేదు..’ అన్నది కవిత వాదన. కానీ, అసలు విషయం వేరేలా వుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితదే కీలక పాత్ర అన్న ప్రచారం జరుగుతోంది. ఆయా అరెస్టుల సందర్భంగా నిందితులు వెల్లడిస్తున్న వివరాల్ని ఆధారంగా చేసుకుని, కవితకి సీబీఐ, ఈడీ సంస్థలు నోటీసులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా, ఈడీ యెదుట కవిత విచారణకు హాజరు కావాల్సి వుంది. ఈడీ విచారణకు హాజరవుతానని కూడా చెబుతున్నారమె. అయితే, తన మీద రాజకీయ కుట్ర జరుగుతోందనీ, మహిళల తరఫున గళం విప్పుతున్న తనను వేధిస్తున్నారనీ, యావత్ తెలంగాణపై కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ కుట్ర చేస్తోందనీ కవిత ఆరోపిస్తున్నారు.
‘ముందస్తు అపాయింట్మెంట్ల నేపథ్యంలో విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను..’ అంటూ ఈడీ విచారణకు హాజరయ్యే విషయమై కవిత ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కేసీయార్, బీఆర్ఎస్ని లొంగదీసుకోవాలనుకుంటే అది బీజేపీ వల్ల కాదు..’ అని ఆ ప్రకటనలో కవిత పేర్కొన్నారు. ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో మహిళా బిల్లు కోసం ఒకరోజు నిరాహార దీక్ష తలపెట్టామనీ, ఇంతలోనే తనకు ఈడీ నోటీసు వచ్చిందని కవిత చెబుతుండడం కొసమెరుపు.
‘హక్కుల కోసం పోరాడతాం.. బీజేపీ వైఫల్యాల్ని ఎండగడతాం..’ అని తాను విడుదల చేసిన ప్రకటనలో కవిత పేర్కొన్నారు.
575347 911932I saw a great deal of internet site but I believe this one has got something unique in it in it 174497
966697 32440There is noticeably a bundle to know about this. I assume you created certain nice points in features also 324531
575178 899679Yay google is my king assisted me to find this outstanding web site ! . 354777