Switch to English

తిరుపతి బై పోల్: బీజేపీకి జనసైనికులు సహకరిస్తారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

దుబ్బాక, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల పరిస్థితి వేరు. తెలంగాణలో బీజేపీకి అగ్రెసివ్ నేచర్ వున్న నాయకుల బలం వుంది. అదే సమయంలో, తెలంగాణలో ‘హిందుత్వ’ నినాదం సహా, అనేక సానుకూలతలు బీజేపీకి వున్నాయి. తెలంగాణ నుంచి బీజేపీకి ఓ కేంద్ర మంత్రి, పలువురు ముఖ్య నేతలూ వున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే బీజేపీ నుంచి అంతకు ముందు గెలిచినా, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఇన్ని సానుకూలతలు తెలంగాణలో వుండబట్టే బీజేపీ, దుబ్బాక సహా గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా నిలబడగలిగింది. దుబ్బాకలో అధికార టీఆర్ఎస్‌ని ఓడించింది.

మరి, ఆంధ్రపదేశ్ మాటేమిటి.? తిరుపతి ఉప ఎన్నికలో గెలవడానికి బీజేపీ వద్ద వున్న బలమేంటి.? ఏపీ బీజేపీలో వున్న చాలామంది నేతలపై ‘వైసీపీ కోవర్టులు’ అనే ముద్ర వుంది. ఇంకొందరిపై ‘టీడీపీ కోవర్టులు’ అన్న ముద్ర కూడా లేకపోలేదు. ‘జనసేన మద్దతుదారులు’ అనే ఇమేజ్ కూడా కొందరికి వుంది. ఇంతటి సంక్లిష్టత కలిగిన బీజేపీ, తిరుపతి ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టాలనే పట్టుదలకు పోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

అది సరే, మిత్రపక్షం జనసేన.. పూర్తిస్థాయిలో బీజేపీకి సహకరిస్తుందా.? అన్నది ఇంకో కీలకమైన ప్రశ్న. జనసేనను మొదటి నుంచీ బీజేపీ చిన్నచూపు చూస్తూనే వుంది. అమరావతి విషయంలో కావొచ్చు, విశాఖ ఉక్కు విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. మిత్రపక్షం జనసేన కంటే కూడా వైసీపీ మీదనే కొందరు బీజేపీ నేతలు ఎక్కువ అభిమానం చూపిస్తూ వస్తున్నారు. ఒక్కోసారి బీజేపీ ప్రయోజనాల్ని పక్కన పెట్టి, వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నారు కొందరు బీజేపీ నేతలు. ఇవన్నీ, జనసైనికులకు ఒకింత అసహనం కలిగించిన మాట వాస్తవం.

పైగా, బీజేపీ కంటే ఎక్కువ బలం వున్న జనసేనకు తిరుపతి టిక్కెట్ వదిలేయకపోవడంపైనా జనసైనికుల్లో అసహనం వుంది. అదంతా సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూనే వుంది. సో, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీకి, జనసేన నాయకులు సహకరించొచ్చేమోగానీ, జనసైనికులు సహకరించకపోవచ్చు.

5 COMMENTS

  1. 98203 684278Youre so cool! I dont suppose Ive read anything like this before. So good to search out any individual with some original thoughts on this subject. realy thank you for starting this up. this web site is 1 thing thats wanted on the internet, somebody with a bit of originality. useful job for bringing something new towards the internet! 248069

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...