Switch to English

జగన్ ఆ ఛాన్స్ వినియోగించుకుంటారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

‘‘తెలంగాణ నుంచి మరో ఆంధ్రా పార్టీ తుడిచిపెట్టుకుని పోయింది’’ – ఇదీ 2016లో వైఎస్సార్ సీపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య. అప్పటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్సార్ సీపీ నిర్ణయం తీసుకున్నప్పుడు కేటీఆర్ అలా వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం గట్టడంతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ వారినే గెలిపించారు. ఇక అప్పటి నుంచి తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ పోటీ చేయలేదు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కేసీఆర్ పాలనపై పలు వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. పైగా పలు అంశాల్లో పొరుగు రాష్ట్రం ఏపీతో పోలికలు మొదలయ్యాయి.

కేసీఆర్ సర్కారు కంటే జగన్ సర్కారు ఎన్నో రెట్లు మేలనే భావన తెలంగాణలో వ్యాప్తి చెందుతోంది. ఉద్యోగులు, యువత, విద్యార్థులు, రైతుల విషయంలో జగన్ సర్కారు చర్యలు అభినందనీయం అంటూ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. పాలన చేపట్టిన నాలుగు నెలల్లోనే హామీలు నెరవేరుస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నారంటూ జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే కనీసం రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించారు. తీరా రాష్ట్రం వచ్చాక జరిపిన ప్రభుత్వ నియామకాలు అంతంత మాత్రమే.

ఈ విషయంలో విద్యార్థులు, నిరుద్యోగుల్లో ఎప్పటి నుంచో అసంతృప్తి గూడు కట్టుకుని ఉంది. మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చిన్నవో, పెద్దవో దాదాపు లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేశారు. తెలంగాణలో మాత్రం ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇక ఉద్యోగుల విషయంలోనూ జగన్ సర్కారు సానుకూలంగానే వ్యవహరించి ఐఆర్ ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. తెలంగాణలో మాత్రం కేసీఆర్ సర్కారు వీటిని పట్టించుకోవడంలేదు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో జగన్ పై ప్రశంసలు, కేసీఆర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ సిబ్బంది సైతం జగన్ అనుకూల నినాదాలు చేస్తూ కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో వైఎస్సార్ సీపీ పునరుజ్జీవం చెందడానికి ఇదే సరైన సమయం అని పలువురు పేర్కొంటున్నారు. జగన్ ఈ విషయంపై దృష్టి సారించి 2021లో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి దిగాలని పలువురు సూచిస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా వేలాది మంది ఈ మేరకు పోస్టులు పెడుతున్నారు. అయితే, జగన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో అన్న చర్చ అప్పుడే మొదలైంది. ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు చాలా తక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ను పెద్దన్నగా భావిస్తున్న జగన్.. ఆయనకు వ్యతిరేకంగా వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ముందు ముందు పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వస్తే మినహా.. తెలంగాణలో టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా జగన్ పోటీ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...