Switch to English

కిట్ల కొనుగోలులో శాండర్ సంగతేంటి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

ఏపీలో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలులో రేగిన దుమారం ఇంకా చల్లారలేదు. ఈ కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిపోయిందని విపక్షాలు ఆరోపించగా.. అలాంటిది ఏమీ లేదని సర్కారు తేల్చి చెప్పింది. పైగా అధికారుల ముందుచూపు కారణంగా కిట్ రేట్ తగ్గిందని, ఛత్తీస్ గఢ్ కు సరఫరా చేసిన ధరనే తీసుకోవడానికి కంపెనీ అంగీకరించిందంటూ సీఎం జగన్ వివరణ ఇచ్చారు. ఈ

సందర్భంగా అధికారులను ఆయన అభినందించారు కూడా. అయినప్పటికీ విపక్షాలు మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఈ మొత్తం వ్యవహారంలో గోల్ మాల్ జరిగిందని, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతోనే సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టిందని, ఒకవేళ సోషల్ మీడియా దీనిని పట్టించుకోకపోయి ఉంటే కమీషన్లు కొట్టేసేవారేనంటూ దుయ్యబడుతున్నాయి.

కేంద్రం రూ.795 వెచ్చించి గుర్గావ్ లోని జీన్స్ టూమీ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ దగ్గర కొనుగోలు చేయగా.. ఛత్తీస్ గఢ్ దక్షిణ కొరియాకు చెందిన ఎస్ డీ బయోసెన్సర్స్ అనే కంపెనీ నుంచి రూ.337కి కిట్ కొనుగోలు చేసింది. ఏపీ కూడా ఇదే కంపెనీ కిట్స్ ను కొనుగోలు చేసింది. ఛత్తీస్ గఢ్ ఓపెన్ టెండర్లు పిలిచి, ఎస్ డీ బయోసెన్సర్స్ కు కాంట్రాక్టు ఇవ్వగా.. ఏపీ మాత్రం ఈ కంపెనీ నుంచి నేరుగా కొనలేదు. హైదరాబాద్ కు చెందిన శాండర్ మెడికియాడ్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ద్వారా వీటిని తెప్పించింది. అంటే.. ప్రభుత్వానికి, ఎస్ డీ బయోసెన్సర్స్ కి మధ్యవర్తిగా శాండర్ వ్యవహరించింది.

ఈ నేపథ్యంలోనే రేటులో అంత తేడా వచ్చిందని విపక్షాలు పేర్కొంటున్నాయి. ఏపీలో మందులు, వైద్య పరికరాలను కొనుగోలును పర్యవేక్షించే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ)కి శాండర్ మెడికియాడ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి మధ్య కిట్ల సరఫరాపై ఒప్పందం కుదిరింది. నేరుగా ఎస్ డీ బయోసెన్సార్స్ నుంచి తెప్పించుకునే వీలున్నప్పటికీ, మధ్యలో శాండర్ కంపెనీ ఎలా వచ్చిందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

కేవలం కమీషన్ల కోసం ఈ కంపెనీని తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి టెండర్లు ఎప్పుడు పిలిచారని ప్రశ్నిస్తున్నాయి. నిజానికి శాండర్ కంపెనీకి ఇచ్చిన పర్చేజ్ ఆర్డర్ లో రేటు విషయమై ముందుగానే క్లాజ్ పెట్టారు. ఇప్పుడు దాని ఆధారంగానే రూ.337 మాత్రమే చెల్లిస్తానని ఆ కంపెనీకి తెలిపారు. ఆ కంపెనీ ఇందుకు అంగీకరించిందని కూడా వెల్లడించారు. ఒకవేళ ఆ కంపెనీ అందుకు అంగీకరించకపోయినా ప్రభుత్వం మాత్రం చేసేదేమీ లేదు.

ఎందుకంటే దేశంలోని ఏ రాష్ట్రానికైనా ఇంతకంటే తక్కువ ధరకు వీటిని సరఫరా చేస్తే అదే ధర తాము చెల్లిస్తామని క్లాజ్ లో పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు శాండర్ కంపెనీ ఏపీకి మాత్రమే ఈ కిట్లను సరఫరా చేసింది. ఛత్తీస్ గఢ్ నేరుగా ఎస్ డీ బయోసెన్సార్స్ నుంచే కొనుగోలు చేసినందున ఇక్కడ శాండర్ ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో తాము ఏ ఇతర రాష్ట్రానికీ సరఫరా చేయనందున.. ఇదే ధర చెల్లించాలని పట్టుబడితే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. కిట్ల కొనుగోలులో విపక్షాల ఆరోపణలు, సందేహాలు ఇంకా కొనసాగుతున్నందున ప్రభుత్వం దీనిపై మళ్లీ వివరణ ఇస్తుందో లేదో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...