Switch to English

అమర్ రాజా కాలుష్యం.. దివీస్ పరిమళం.. ఏందీ వైపరీత్యం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

అమర్ రాజా పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళనలు, ఉద్యమాలు జరగలేదు. కానీ, ఆ పరిశ్రమని రాష్ట్రం నుంచి వెల్లగొడుతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళనలు, ఉద్యమాలు జరిగాయి. కానీ, దివీస్ పరిశ్రమ పట్ల జగన్ సర్కార్ ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతోంది. పైగా, ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో దివీస్ పరిశ్రమను పెట్టనీయబోమంటూ నినదించిన వైఎస్ జగన్, ముఖ్యమంత్రి అయ్యాక.. ఆ పరిశ్రమ కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్ళేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కానీ, వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో దాన్ని విరమించుకున్నారు. అసలేం జరుగుతోంది రాష్ట్రంలో.?

ఏ పరిశ్రమ అయినా కాలుష్యాన్నే ఇస్తుంది.. సుగంధ పరిమళాల్ని అయితే ఇవ్వదు. చిన్న పరిశ్రమ అయినా, పెద్ద పరిశ్రమ అయినా వెద జల్లేది కాలుష్యమే.. ఇది జగమెరిగిన సత్యం. ‘మేమే అమర్ రాజా పరిశ్రమని పొమ్మన్నాం..’ అని ప్రభుత్వ పెద్దలు ఘనంగా చెప్పుకున్నారు. అంతలోనే, ‘తూచ్, కాలుష్య కారకాల్ని తగ్గించుకుని, పరిశ్రమను ఎంచక్కా నడుపుకోవచ్చు.. పరిశ్రమ తరలి వెళ్ళాలని మేం కోరుకోవడంలేదు..’ అంటూ వివరణ ఇచ్చుకున్నారు అధికార పార్టీ పెద్దలు.

ఇక్కడ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్షంపై రాజకీయ కుట్రలో భాగంగానే, అధికార పక్షం.. తన శక్తి యుక్తులన్నిటినీ ప్రయోగించి, రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది. ఉత్తరాంధ్రలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువులకు చెందిన పలు పరిశ్రమల నుంచి కాలుష్యం అత్యంత భయంకరంగా ప్రజల మీద దాడి చేస్తోందన్న విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అలాంటి పరిశ్రమల జోలికి పొల్యూషన్ బోర్డ్ కన్నెత్తి కూడా చూడటంలేదాయె. కాలుష్యం పేరుతో మూసెయ్యాలంటే, రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా వుండబోదేమో.. అన్న వాదనలూ లేకపోలేదు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, నిర్మాణాల్ని కూల్చెయ్యడమో.. పరిశ్రమల్ని, పెట్టుబడిదారుల్ని వెల్లగొట్టడమో జరిగింది తప్ప.. కొత్తగా పరిశ్రమలు వచ్చే పరిస్థితులుగానీ, కొత్తగా పెట్టుబడులు వచ్చే వాతావరణంగానీ ఎందుకు కనిపించడంలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు.?

టీడీపీ మీద రాజకీయ వైరం వుంటే.. అది వేరే చర్చ. దానికెలాగూ ఏసీబీ, సీఐడీ వంటి వాటి ద్వారా కేసులు పెట్టించడం, అరెస్టులు చేయించడం.. వంటివి జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజల మీదా, రాష్ట్రం మీదా ఎందుకు కత్తి గట్టడం.? అన్నది రాజకీయ పరిశీలకుల ఆవేదన. ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న ఈ చిత్ర విచిత్రమైన పాలన, పొరుగు రాష్ట్రాలకు మాత్రం వరంగా మారుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

Heatwave: నాగ్ పూర్ లో 56డిగ్రీల ఉష్ణోగ్రతలు నిజం కాదు.. ఐఎండీ ప్రకటన

Heatwave: దేశం మొత్తం ఎండలు, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో మే 31న నాగ్ పూర్ (Nagpur) నగరంలో ఏకంగా 56డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైందనే వార్త తీవ్ర సంచలనం రేపింది. దీంతో...

కూటమి వైపు తిరుగుతున్న సర్వేలు.! వైసీపీ పంపకాల కష్టం వృధా.!

సర్వేలు బాబోయ్ సర్వేలు.! అన్నీ పెయిడ్ సర్వేలే.! ఇవి చాలవన్నట్టు, సోషల్ మీడియా వేదికగా రచ్చ రంబోలా.! వైసీపీకి 150కి పైగా సీట్లు వస్తాయంటూ చాలా సర్వేలు ఊదరగొట్టేశాయ్.! ఇవన్నీ ఐ-ప్యాక్ టీమ్...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good bad ugly)...

Chiranjeevi: సినీ జర్నలిస్టులపై చిరంజీవికి ప్రత్యేక గౌరవం.. ఇవే ఉదాహరణలు

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi)కి సినిమా అంటే ఇష్టం. అభిమానులంటే ఇష్టం. సినిమా వ్యక్తులంటే ఇష్టం. అలాగే సినీ పాత్రికేయులంటే మరీ ఇష్టం. కారణం.. ఆయన తెలుగు సినీ కళామతల్లి బిడ్డ. పరిశ్రమ నీడన...

‘నైరుతి’ ఎఫెక్ట్.. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

నైరుతి రుతుపవనాలు జూన్ 1 లేదా 2 న రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు...