ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల మీద బెట్టింగులు.. ఇవన్నీ కామన్ అయిపోయాయి కదా.!
ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, ఓ సంస్థతో కలిసి సర్వే నిర్వహించిందట. ఆ సర్వే కాస్తా, ఎగ్జిట్ పోల్ అంచనాల రూపంలో వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. అయితే, సదరు సంస్థ పేరుని బయటపెడతారా.? లేదా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఓ సినీ ప్రముఖుడు, ఓ రాజకీయ పార్టీ గెలుపుకి సంబంధించి లక్షల్లో బెట్టింగ్ కాశాడంటూ ప్రచారం జరుగుతోంది. ఒకరేంటి.? పది పాతిక.. ఇలా చెప్పుకుంటూ పోతే, పెద్ద లెక్కే వుందని అంటున్నారు. లక్షల్లోనే అందరూ బెట్టింగులు కాశారట. అయితే, ఈ విషయాన్ని ఎవరూ బాహాటంగా ఒప్పుకోరనుకోండి.. అది వేరే సంగతి.
సినీ పరిశ్రమలో చాలామంది వైసీపీ ఓడిపోవాలని కోరుకుంటున్నమాట వాస్తవం. గడచిన ఐదేళ్ళలో, సినీ పరిశ్రమని వైసీపీ రాచి రంపాన పెట్టిందన్నది బహిరంగ రహస్యం. అయితే, అదే సినీ పరిశ్రమలో కొందరు, వైసీపీకి తెరవెనుకాల మద్దతిస్తున్నమాట కూడా వాస్తవం.
అలా, ఆ కొందరు వైసీపీ తరఫున కూడా బెట్టింగులు కాస్తున్నారు. చిత్రమేంటంటే, వైసీపీ మద్దతుదారులైన సినీ ప్రముఖులు కొందరు, వైసీపీ తరఫున బెట్టింగులు కాస్తూ, వైసీపీ పెద్దల మన్ననలు అందుకుంటున్నారట. అదే సమయంలో, వారి సన్నిహితులతో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి అనుకూలంగా బెట్టింగులు కాయిస్తున్నారట.
అంటే, ఓ వైపు డబ్బులు పోయినా, ఇంకో వైపు డబ్బులు వచ్చేస్తాయన్నమాట. అదిరింది కదా ఆలోచన.! సినీ రంగంలో ఇంతకు ముందెన్నడూ లేనంత పొలిటికల్ ఉత్కంఠ, ఈసారి ఏపీ ఎన్నికల మీద కనిపిస్తోంది.