Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్ జంటగా నటించారు. విగన్ క్రియేషన్ సమర్పణలో విద్య గణేష్ సినిమాను నిర్మించారు. సురేశ్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కిన ‘విల్లా 369’ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందని మేకర్స్ అంటున్నారు.
‘విల్లా 369’లో ఏం జరిగిందనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కింది. అతిత్వరలోనే సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్డేట్స్ తో చిత్ర యూనిట్ రానుంది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు తేజ ఇటివల విడుదల చేశారు. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘విల్లా 369’ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నిటినీ పూర్తి చేసుకని త్వరలో సెన్సార్ కు వెళ్లబోతోందని దర్శకుడు సురేశ్ ప్రభు అన్నారు.
సినిమాకు ఎక్ష్కిక్యుటివ్ ప్రొడ్యూసర్ గా నటుడు చిత్రం శ్రీను వ్యవహరించారు. సంగీతం మహావీర్ అందిస్తున్నారు. సినిమాలో.. రవివర్మ, జ్యోతి, చిత్రం శ్రీను తదితరులు నటించారు.